మెంటల్ హెల్త్ పై ఉపాసన కామెంట్స్.. ఈ పనులే చెయ్యాలంటూ?

మెగా స్టార్ చిరంజీవి కోడలు, స్టార్ హిరో రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఎందుకంటే ఈమె తెలుగు రాష్ట్రాల్లో తన పరిచయాన్ని పూర్తిగా పెంచేసుకుంది.

 Upasanas Comments On Mental Health To Do These Things Upasana, Tollywood, Ment-TeluguStop.com

బాగా హాట్ టాపిక్ గా మారింది.ముఖ్యంగా మెగా ఇంటి కోడలిగా కంటే సొంత గుర్తింపుతో తెలుగు ప్రజలకు పరిచయమైంది.

ఇక ఈమె అపోలో వైస్ చైర్మన్ బాధ్యతలు చేపడుతుంది.

ఇక ఈమె పెళ్లికి ముందు రామ్ చరణ్ ను ఓ మీటింగ్ లో కలవడంతో ఆ సమయంలో వారి మధ్య పరిచయం పెరిగింది.

దీంతో వారి మధ్య ప్రేమ పుట్టగా కొంతకాలం రామ్ చరణ్ ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పకుండా రహస్యంగా ఉంచాడు.ఆ తర్వాత రామ్ చరణ్ సమయం చూసుకొని చెప్పటంతో వెంటనే చిరంజీవి ఓకే అనేసి ముహూర్తాలు పెట్టాడు.

అలా వీరి ప్రేమను అంగీకరించిన పెద్దలు 2012 లో చాలా గ్రాండ్ గా పెళ్లి చేశారు.పెళ్లి తర్వాత ఈ జంట ఎంతో అన్యోన్యంగా కనిపించింది.ఇప్పటికీ ఈ జంట అంతే అన్యోన్యంగా ఉన్నారు.ఇక వీరి పెళ్లి అయ్యి పదేళ్లు పూర్తవగా ఇప్పటికి వీరికి పిల్లలు లేరన్న విషయం అందరికీ తెలిసిందే.

దీంతో ఈ విషయం పట్ల మెగా అభిమానులు చాలా బాధపడుతున్నారు.ఎప్పుడెప్పుడు ఈ జంట తల్లిదండ్రులు అవుతారా అని ఎదురుచూస్తున్నారు.

కానీ ఈ జంట మాత్రం తమ అభిమానులకు ఇంకా గుడ్ న్యూస్ చెప్పడం లేదు.వీరికి కూడా చాలాసార్లు ఈ ప్రశ్న ఎదురవ్వగా ఎప్పటికప్పుడు ఈ మాటలను ఖండిస్తూనే ఉన్నారు.

ఇక ఉపాసనకు మాత్రం తెలుగు రాష్ట్రాలలో మంచి పేరు, ప్రఖ్యాతలు ఉన్నాయి.మామకు తగ్గ కోడలు అని చాలా మంది చాలా సార్లు ప్రశంసలు కురిపించారు.పైగా ఉపాసన సోషల్ సర్వీస్ లలో కూడా బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది.ప్రతి ఒక్క విషయంలో తను బాగా స్పందిస్తుంది.

ఉపాసన సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తుంది.సోషల్ మీడియా వేదికను ఎక్కువగా తన వ్యక్తిగత విషయాలకే కాకుండా ప్రజలకు అవసరమయ్యే విషయాలను కూడా చెప్పడానికి కూడా బాగా వాడుతుంది.చాలావరకు హెల్త్ టిప్స్ గురించి బాగా వివరిస్తుంది.గతంలో ఉపాసన కోవిడ్ సమయంలో తన హాస్పిటల్ తరఫున ఎంతోమందికి సహాయం చేసింది.అయితే తాజాగా తన ఇన్ స్టా వేదికగా మరో విషయాన్ని పంచుకుంది.అదేంటంటే.

మాములుగా చాలామంది మెంటల్ హెల్త్ తో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు.దీంతో ఏమి చేయలేక దానివల్ల మరింత స్ట్రెస్ గా ఫీల్ అవుతూ ఉంటారు.

అయితే అలాకాకుండా కేవలం కొన్ని పనుల ద్వారా మెంటల్ హెల్త్ అనేది బాగుంటుంది అని ఉపాసన తెలిపింది.

ఇక తన మెంటల్ హెల్త్ కూడా బాగుండటానికి కారణం చెప్పేసింది.అదేంటంటే సమయానికి మంచి ఫుడ్ తీసుకోవటం, మంచిగా పడుకోటం, ప్రతి విషయంలో ధైర్యంగా ఉండటం, వర్కౌట్ చేయటం అనేది మెంటల్ హెల్త్ కు ఉపయోగపడుతుంది అంటూ మరి కొన్ని విషయాలు పంచుకుంది ఉపాసన.ఇక ప్రస్తుతం ఆమె షేర్ చేసుకున్న పోస్ట్ నెట్టింట్లో బాగా వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube