టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన కీర్తి సురేష్ మహానటి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ స్టేటస్ ను అందుకుని ప్రస్తుతం సక్సెస్ ఫుల్ గా హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.అయితే తెలుగులో కీర్తి సురేష్ సక్సెస్ రేట్ తక్కువనే సంగతి తెలిసిందే.
ఈ ఏడాది కీర్తి సురేష్ నటించిన సినిమాలలో ఒకటైన సర్కారు వారి పాట బాక్సాఫీస్ వద్ద అబవ్ యావరేజ్ గా నిలిచింది.ఒక్కో ప్రాజెక్ట్ కు కీర్తి సురేష్ 2 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.
కీర్తి సురేష్ మొత్తం ఆస్తుల విలువ ఏకంగా 22 కోట్ల రూపాయల వరకు ఉంటుందని సమాచారం అందుతోంది.రాబోయే రోజుల్లో కీర్తి సురేష్ ఆస్తుల విలువ భారీగా పెరిగే ఛాన్స్ అయితే ఉంది.
కథ నచ్చితే స్టార్ హీరోలకు చెల్లి పాత్రలో నటించడానికి కూడా కీర్తి సురేష్ ఓకే చెబుతున్నారు.కెరీర్ తొలినాళ్లలో బొద్దుగా కనిపించిన కీర్తి సురేష్ ప్రేక్షకులకు మరింత దగ్గర కావడం కోసం బరువు తగ్గి లుక్ ను మార్చుకున్నారు.
తాజాగా కీర్తి సురేష్ సినిమాలకు గుడ్ బై చెప్పి పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు ప్రచారంలోకి రాగా ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని స్పష్టత వచ్చిన సంగతి తెలిసిందే.

కీర్తి సురేష్ పెళ్లి చేసుకుంటే మాత్రం మా హార్ట్స్ బ్రేక్ అవుతాయని ఇందులో ఏ మాత్రం సందేహం అవసరం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా కీర్తి సురేష్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.