2023 సంక్రాంతి పండుగ కానుకగా రిలీజవుతున్న సినిమాలలో అన్ని సినిమాలపై మంచి అంచనాలు ఏర్పడగా మొత్తం 5 సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి.పేరుకు ఐదు సినిమాలు థియేటర్లలో విడుదలవుతున్నా క్రేజ్ ఉన్న సినిమాలు మాత్రం కేవలం 3 మాత్రమే అనే సంగతి తెలిసిందే.
వీరసింహారెడ్డి, వారసుడు, వాల్తేరు వీరయ్య సినిమాలపై ప్రధానంగా ప్రేక్షకుల దృష్టి ఉంది.
వాల్తేరు వీరయ్య సినిమాకు ఎక్కువగా 570 స్క్రీన్లను కేటాంచారని తెలుస్తోంది.
వీరసింహారెడ్డి సినిమా విషయానికి వస్తే ఈ సినిమా 400 స్క్రీన్లలో రిలీజ్ కానుందని సమాచారం.వారసుడు సినిమా 250 స్క్రీన్లలో తునివు సినిమా 50 స్క్రీన్లలో ప్రదర్శితం కానుంది.
తెలుగు రాష్ట్రాల్లోని మిగతా థియేటర్లకు సంబంధించిన లెక్కలు మాత్రం తెలియాల్సి ఉంది.థియేటర్ల విషయంలో మాత్రం మెగాస్టార్ ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు.

ఈ సినిమాలు విడుదలైన తర్వాత వచ్చే టాక్ ఆధారంగా థియేటర్ల కేటాయింపులో ప్రాధాన్యత మారే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.వారసుడు సినిమాను తక్కువ థియేటర్లలోనే దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారని అయితే ఈ థియేటర్లు ప్రైమ్ థియేటర్లు అని సమాచారం.ప్రేక్షకులలో క్రేజ్ ఉన్న థియేటర్లకు దిల్ రాజు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారని సమాచారం.డబ్బింగ్ సినిమాలు, స్ట్రెయిట్ సినిమాలు ఒకే సమయంలో విడుదలవుతూ ఉండటంతో సినిమాల మధ్య గట్టి పోటీ నెలకొంది.
ఏ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుందో అంటూ ఫ్యాన్స్ మధ్య చర్చ జరుగుతోంది.సంక్రాంతి సినిమాలు అంచనాలకు మించి సక్సెస్ ను సొంతం చేసుకోవడంతో పాటు రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
సంక్రాంతికి విడుదలవుతున్న అన్ని సినిమాల బడ్జెట్లు కలిపితే 700 కోట్ల రూపాయలుగా ఉండవచ్చని సమాచారం అందుతోంది.సంక్రాంతి సినిమాలన్నీ 1000 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకోవాలని అభిమానులు భావిస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.







