మాస్ మహారాజా రవితేజ బ్యాక్ టు బ్యాక్ అట్టర్ ఫ్లాప్ లను సొంతం చేసుకున్నాడు.దాంతో ఆయన తదుపరి సినిమా విషయమై అభిమాను లతో పాటు ప్రతి ఒక్కరిలో కూడా ఒకింత అనుమానం ఉంది అనడం లో సందేహం లేదు.
ధమాకా సినిమా తో ఈ నెల లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.రవితేజ మెల్ల మెల్లగా ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తున్నాడు.
ఇప్పటికే సినిమా యొక్క పాటలు మరియు పోస్టర్స్ విడుదల చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించిన ధమాకా చిత్ర యూనిట్ సభ్యులు తాజాగా సినిమా యొక్క రన్ టైం ని అధికారికంగా బయటకు తెలియజేసి పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది.
ఈ సినిమా రెండు గంటల ఐదు నిమిషాల నుండి రెండు గంటల పది నిమిషాల వరకు మాత్రమే ఉంటుందట.
ఈ మధ్య కాలం లో ఎక్కువ నిడివి ఉన్న సినిమా లు బాక్స్ ఆఫీస్ వద్ద ఆడటం లేదు.అందుకే నిడివి తగ్గించామని గగ్గోలు పెట్టి సినిమా థియేటర్లకు ప్రేక్షకులను రప్పించే ప్రయత్నం చేస్తున్నారు.
అందుకే ముందస్తుగానే ధమాకా సినిమా యొక్క రన్ టైం చాలా తగ్గించాం అంటూ చిత్రాన్ని సభ్యులు చెప్తున్నారు.రెండు గంటల సినిమా కనుక కచ్చితంగా మంచి ఎంటర్టైన్మెంట్ ని అందిస్తుంది అనే నమ్మకాన్ని ప్రేక్షకులు కూడా వ్యక్తం చేస్తున్నారు.

రవితేజ ఫ్యాన్స్ ఈ విషయమై చాలా హ్యాపీగా ఉన్నారట.రవితేజ గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమా కచ్చితంగా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం తో పాటు ఆయన అభిమానులు మరియు ప్రేక్షకులు ఆశించే వినోదాన్ని పంచుతుందని విశ్వసిస్తున్నారు.మొత్తానికి మాస్ మహారాజా రవితేజ ఈ సినిమా తో సక్సెస్ ట్రాక్ ఎక్కి మళ్ళీ కొంత కాలం హీరోగా కంటిన్యూ అవుతాడా లేదంటే ఈ సినిమా ఫెయిల్యూర్ తో తన కెరీర్ విషయం లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడతాడు అనేది చూడాల్సి ఉంది.







