హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయం దగ్గర సంబురాల్లో అపశృతి నెలకొంది.గుజరాత్ లో భారీ విజయం సాధించడంతో హైదరాబాద్ కార్యాలయంలో పార్టీ శ్రేణులు సంబురాలు నిర్వహించారు.
ఇందులో భాగంగా బాణాసంచా కాలుస్తుండగా ప్రమాదం సంభవించిందని తెలుస్తోంది.నిప్పు రవ్వలు భారీగా చెలరేగి బీజేపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో పాటు కరెంట్ తీగలు కాలిపోయాయి.
సమీపంలో ఎండుటాకులు, కర్రలు ఉండటంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి.వెంటనే అప్రమత్తమైన బీజేపీ నేతలు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.