కొవ్వూరు నియోజకవర్గం: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 74 వ రోజు చాగల్లు మండలం ఊనగట్ల గ్రామంలో హోం శాఖ మాత్యులు తానేటి వనిత గారు పర్యటించారు.ఈ మూడు సంవత్సరాల కాలంలో సీఎం జగన్ గారు అందించిన సంక్షేమ పథకాల గురించి ఇంటింటికి తిరిగి వివరించారు.
ఈ సందర్భంగా తొర్లపాటి మహాలక్ష్మి అనే వృద్ధురాలు హోంమంత్రి తానేటి వనిత గారిని కలిసి తన మనసులోని భావాలను పంచుకున్నారు.
తన లాంటి ఎంతో మంది కొడుకులు లేని తల్లులకు సీఎం జగన్ కన్న కొడులాగా పెన్షన్ ఇస్తూ ఆదుకుంటున్నాడని వృద్ధురాలు ఆనందం వ్యక్తం చేసింది.
గత ప్రభుత్వంలో వచ్చే 500 రూపాయల కోసం పంచాయతీ ఆఫీసుల చుట్టూ ఎండనక, వాననక తిరిగేవాళ్ళమని వృద్ధురాలు బాధపడింది.కానీ సీఎం జగన్ గారు వాలంటరీల ద్వారా ఇంటి వద్దకే 2500 రూపాయల పెన్షన్ అందిస్తున్నారని మహాలక్ష్మి సంతోషం వ్యక్తం చేసింది.
సీఎం జగన్ గారు ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాయని హోంమంత్రి తానేటి వనిత గారు తెలిపారు.దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సంక్షేమ పాలన చేస్తున్న ఏకైక సీఎం జగన్ గారు అని కొనియాడారు.
గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా లబ్ధిదారుల ఇంటికే సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత సీఎం గారికి దక్కుతుందన్నారు.వృద్ధులు, మహిళలు, రైతులు ఇలా ప్రతి ఒక్కరూ సీఎం జగన్ గారికి ఆశీస్సులు అందిస్తున్నారని హోంమంత్రి తానేటి వనిత గారు తెలిపారు.