Sai Dharam Tej Virupaksha : 'విరూపాక్ష'తో రాబోతున్న సాయి తేజ్.. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అదిరిందిగా!

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ పిల్ల నువ్వులేని జీవితం సినిమాతో హీరోగా పరిచయం అయ్యి ఒక మోస్తరు హిట్ అందుకున్నాడు.ఈ సినిమా తర్వాత సుప్రీం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.

 Sai Dharam Tej Virupaksha Title Glimpse, Director Karthik Dandu, Ntr ,sai Dharam-TeluguStop.com

ఆ తర్వాత తన నటనతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.అయితే ఈయన హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్న సమయంలోనే యాక్సిడెంట్ అయ్యింది.

దీంతో కొద్దీ రోజుల పాటు విశ్రాంతి తీసుకుని ఇటీవలే మళ్ళీ సెట్స్ లోకి అడుగు పెట్టాడు.ప్రెజెంట్ సాయి తేజ్ తన కెరీర్ లో 15వ సినిమా చేస్తున్నాడు.SDT15 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ వేగంగా పూర్తి చేసుకుంటుంది.థ్రిల్లర్ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లపై నిర్మిస్తున్నారు.

‘SDT15’ సినిమాకు కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు.ఇక ఈ సినిమా నుండి తాజాగా అదిరిపోయే అప్డేట్ వచ్చింది.ఈ సినిమా టైటిల్ గ్లిమ్ప్స్ ని ఈ రోజు మేకర్స్ రిలీజ్ చేసారు.”విరూపాక్ష” అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు.ఇక ఈ గ్లిమ్ప్స్ లో మరో విశేషం ఏంటంటే.ఈ గ్లిమ్ప్స్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందిస్తున్నాడు.దీంతో ఈ గ్లిమ్ప్స్ మీద మరింత ఆసక్తి పెరిగి పోయింది.

తెలియని నిజాన్ని చూపించే మరో నేత్రమే ఈ ‘విరూపాక్ష’ అంటూ టైటిల్ రివీల్ చేసారు.ఈ గ్లిమ్ప్స్ లో విజువల్స్ ఆసక్తిగా ఉండడం.ఎన్టీఆర్ వాయిస్ అన్ని కలిపి బాగా ఆకట్టు కుంటుంది.

ఇక ఈ సినిమాకు సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తుండగా.కాంతారా ఫేమ్ అంజనీస్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నాడు.

ఇప్పటి వరకు లవ్ స్టోరీలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సాయి తేజ్ ఇప్పుడు రూట్ మార్చి కొత్త పంథాలో చేస్తున్న ఈ సినిమా ఈ మెగా హీరోకు ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి.

https://youtu.be/V5RxLCKdBvM
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube