విక్టరీ వెంకటేష్ నారప్ప సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది.2021 లో డైరెక్ట్ ఓటీటీగా అమెజాన్ ప్రైం లో రిలీజైంది ఈ మూవీ.తమిళంలో ధనుష్ చేసిన అసురన్ రీమేక్ గా నారప్ప తెరకెక్కింది.ఈ సినిమా ఏడాది తర్వాత థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు.డిసెంబర్ 13న వెంకటేష్ బర్త్ డే సందర్భంగా నారప్ప ని తెలుగు రెండు రాష్ట్రాల్లో థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు.ఈమధ్య స్టార్ హీరోల బర్త్ డే టైం లో వారి ఆల్ టైం హిట్ సినిమాలు రిలీజ్ చేస్తున్నారు.
వెంకటేష్ నారప్ప ని ప్రత్యేకంగా దగ్గుబాటి ఫ్యాన్స్ కి థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చేందుకు రిలీజ్ చేస్తున్నారు.అసలైతే వెంకీ బర్త్ డే స్పెషల్ గా బొబ్బిలి రాజా, జయం మనదేరా రిలీజ్ అనుకోగా ఫైనల్ గా నారప్పకి ఓటు వేశారు.
సో థియేటర్ లో నారప్ప సందడి ఉండబోతుంది.మరి నారప్పని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.శ్రీకాంత్ అడ్డాల ఈ మూవీని తమిళ సినిమాకు ఏమాత్రం తగ్గకుండా తీశారు. సినిమాలో వెంకటేష్ తో పాటుగా ప్రియమణి, రాజీవ్ కనకాల కూడా తమ నేచురల్ యాక్టింగ్ తో మెప్పించారు.