ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం తప్పు అనే సంగతి తెలిసిందే.విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకుంటే ఆ వ్యక్తి శిక్షార్హుడు అవుతాడు.
అయితే మహారాష్ట్రలో తాజాగా కవలలు అయిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ద్వారా వార్తల్లో నిలిచారు.రూపంలో ఒకే విధంగా ఉండే వాళ్లిద్దరూ కలకాలం కలిసి ఉండాలనే ఆలోచనతో ఈ పని చేశారు.
ఈ ఇద్దరు అమ్మాయిల పేర్లు రింకీ పింకీ కాగా అతుల్ అనే వ్యక్తి మంచితనానికి ముగ్ధులై వాళ్లిద్దరు అతనినే పెళ్లి చేసుకున్నారు.అయితే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కాగా సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
సోలాపూర్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 494 కింద కేసు నమోదు చేయడం గమనార్హం.హిందూ ధర్మం ప్రకారం కూడా ఒక వ్యక్తి ఇద్దరు మహిళలను పెళ్లాడకూడదనే సంగతి తెలిసిందే.
గృహలక్ష్మి సీరియల్ నటి కస్తూరి ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడి గురించి స్పందిస్తూ షాకింగ్ కామెంట్లు చేశారు.
![Telugu Actresskasturi, Kasturi, Kasturi Shankar, Maharashtratwin, Rinky Pinky, S Telugu Actresskasturi, Kasturi, Kasturi Shankar, Maharashtratwin, Rinky Pinky, S](https://telugustop.com/wp-content/uploads/2022/12/kasturi-shocking-comments-about-maharashtra-incident-detailsa.jpg )
ఐపీసీ సెక్షన్ ప్రకారం ఇలా పెళ్లి చేసుకోవడం నేరం అని కస్తూరి చెప్పుకొచ్చారు.అయితే ముస్లింలు మాత్రం రెండో పెళ్లి చేసుకున్నా నేరం కాదని కస్తూరి చెప్పుకొచ్చారు.పూర్తి ఇష్టపూర్వకంగా ఈ పెళ్లి జరిగిందని ఆమె కామెంట్లు చేశారు.వాళ్లను సంతోషంగా బ్రతకనివ్వాలని కస్తూరి వెల్లడించడం గమనార్హం.
![Telugu Actresskasturi, Kasturi, Kasturi Shankar, Maharashtratwin, Rinky Pinky, S Telugu Actresskasturi, Kasturi, Kasturi Shankar, Maharashtratwin, Rinky Pinky, S](https://telugustop.com/wp-content/uploads/2022/12/kasturi-shocking-comments-about-maharashtra-incident-detailsd.jpg )
కస్తూరి చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కస్తూరి చెప్పిన అభిప్రాయంతో నెటిజన్లు సైతం ఏకీభవిస్తున్నారు.కస్తూరి సినిమాలలో కూడా యాక్టివ్ కావాలని ఆమె తర్వాత ప్రాజెక్ట్ లతో సక్సెస్ లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
కస్తూరి రెమ్యునరేషన్ కూడా భారీ స్థాయిలోనే ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.