మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా తో బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డ విషయం తెలిసిందే.ఆ సినిమా మినిమం కలెక్షన్స్ కూడా రాబట్ట లేక పోయింది.
అందుకే చిరంజీవి తదుపరి సినిమాల విషయం లో కాస్త ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నాడు.అలా శ్రద్ధ తీసుకొని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన గాడ్ ఫాదర్ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
అందుకే తన ప్రతి సినిమా కు కూడా స్వయంగా అన్ని విషయాల్లో పర్యవేక్షణ చేస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని మెగాస్టార్ నిర్ణయించుకున్నాడు.అందులో భాగంగానే ప్రస్తుతం నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా కు సంబంధించిన అన్ని విషయాల్లో కూడా చిరంజీవి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది.
భారీ అంచనాల నడుమ రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.ఆ వెంటనే సమ్మర్ కానుకగా బోళా శంకర్ సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.
ఆ సినిమా కు మెహర్ రమేష్ దర్శకత్వం వహించాడు.వేదాళం సినిమా కు రీమేక్ అన్నట్లుగా రూపొందిన సినిమా లో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కీలక పాత్ర లో కనిపించబోతుంది.
తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది.ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అయినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు ఆ మధ్య ప్రకటించారు.
కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఫిబ్రవరి నెలలో సినిమా కు సంబంధించిన కీలక సన్నివేశాలను రీ షూట్ చేయబోతున్నారట.

అందుకోసం ఇప్పటి నుండే అందరి నటీనటుల యొక్క డేట్స్ ని తీసుకుంటూ ఉన్నారని తెలుస్తోంది.దాదాపు 20 నుండి 25 రోజుల పాటు షూటింగ్ ఉంటుందని దాంతో చిత్రీకరణ పూర్తి అవుతుందని మెగా వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.మినిమం గ్యారంటీ అన్నట్లుగా ఉండే విధంగా చిరంజీవి సినిమాలు ఉండాలని అందుకోసం ఎన్ని మార్పులు చేర్పులైనా చేస్తాం అన్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
మరి వేదాళం సినిమా ఎలా ఉండబోతుంది అనేది తెలియాలంటే వచ్చే సమ్మర్ వరకు వెయిట్ చేయాల్సిందే.