అడవి శేషు హీరో గా నాని నిర్మాణం లో శైలేష్ కొలను దర్శకత్వం లో వచ్చిన హిట్ 2 భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.పాతిక కోట్ల కలెక్షన్స్ నమోదు చేసిన ఈ సినిమా మూడవ పార్ట్ అతి త్వరలోనే ప్రారంభం కాబోతుంది అన్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.
శైలేష్ కొలను ఇప్పటికే మూడవ పార్ట్ కోసం స్టోరీ లైన్ సిద్ధం చేశాడని.రెండు లేదా మూడు నెలల్లో స్క్రిప్ట్ వర్క్ పూర్తి అవుతుందని.
ఈలోపు నాని చేస్తున్న దసరా సినిమా షూటింగ్ పూర్తి అవ్వబోతుందని ఆ వెంటనే హిట్ 3 సినిమా శైలేష్ కొలను దర్శకత్వం లో ప్రారంభం కాబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.
మరీ ఆలస్యం కాకుండా 2023 సంవత్సరంలోనే హిట్ మూడవ పార్ట్ ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు అంటూ సమాచారం అందుతుంది.
అన్ని వర్గాల ప్రేక్షకులకు కూడా హిట్ సినిమాలు నచ్చుతున్నాయి.కనుక ఈ సీక్వెన్స్ లో మరిన్ని సినిమాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మూడవ పార్ట్ లో హీరో నానితో పాటు మరొక యంగ్ హీరో కూడా నటించే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.ఆ యంగ్ హీరో మరెవరో కాదు అడవి శేషు అంటూ కొందరు లేదు విశ్వక్సేన్ అంటూ మరికొందరు మాట్లాడుకుంటున్నారు.
ఏ హీరో నాని తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు అనేది చూడాలి అంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.దసరా సినిమా తో పాటు హిట్ 3 సినిమా కూడా 2023 సంవత్సరంలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.నాని సినిమా అంటే ఆడియన్స్ మినిమం గ్యారెంటీ అన్నట్లుగా అంచనాలు పెంచుకుని ఉంటారు.అలాంటి ఫ్యాన్స్ యొక్క ఆకలిని తీర్చే విధంగా హిట్ 3 సినిమా ఉంటుంది అంటూ అంతా నమ్మకంతో ఉన్నారు.
హిట్ 2 లోనే హిట్ 3 ని హింట్ ఇచ్చారు.