Air Bag Helmet : ఇలాంటి హెల్మెట్ ఒక్కటే వుంది... దాని ప్రత్యేకత తెలిస్తే వదిలిపెట్టరు!

వాహనదారులకు హెల్మెట్ అనేది ఎంత రక్షణ ఇస్తుందో చెప్పాల్సిన పనిలేదు.అందుకే తరచూ ట్రాఫిక్ ఆఫీసర్లు పదేపదే హెల్మెట్లను ధరించమని కోరుతారు.

 There Is Only One Such Helmet If You Know Its Uniqueness, You Will Not Leave It-TeluguStop.com

ఎందుకంటే అవి మనిషికి ఏదైనా ప్రమాదం సంబందించినపుడు తలకి ఎలాంటి గాయం కాకుండా రక్షణ వలయంగా ఉంటుంది కనుక.అయితే కొన్ని సార్లు హెల్మెట్ ధరించినాకూడా మరణాలు సంభవించడం చాలా దురదృష్టకరం.

అయితే పెరుగుతున్న టెక్నాలజీ మానవుడిని రోజురోజుకి అభివృద్ధి వైపు పరుగులు తీస్తోంది.ఈ తరుణంలో కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తూనే ఉన్నాయి.

ఇందులో భాగంగానే ఓ ఇటాలియన్ హెల్మెట్ తయారీదారు కంపెనీ ఒక వినూత్న హెల్మెట్ ఆవిష్కరించింది.దాని ప్రత్యేకత ఏమంటే ‘ఎయిర్ బ్యాగ్.’ అవును, ఇది ప్రపంచంలోనే ఎయిర్ బ్యాగ్ కలిగిన మొట్ట మొదటి హెల్మెట్ కావడం విశేషం.ఇటాలియన్ కంపెనీ రూపొందించిన ఎయిర్ బ్యాగ్ ఇంటిగ్రేటెడ్ హెల్మెట్ 2023 నాటికి ప్రపంచ మార్కెట్లో అందుబాటులో ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

దాదాపు 70 సంవత్సరాలు గొప్ప అనుభవం కలిగిన స్వీడిష్ కంపెనీ సహకారంతో ఈ ఎయిర్ బ్యాగ్ కలిగిన హెల్మెట్ రూపొందించబడింది అని కంపెనీ ప్రతినిధులు తాజాగా ఒక మీడియా వేదికగా చెప్పుకొచ్చారు.

Telugu Helmet, Italian Helmet, Specialist, Latest-Latest News - Telugu

ఇది ఇంటిగ్రేటెడ్ ఎయిర్ బ్యాగ్ కారు డ్యాష్ బోర్డ్ లోని టెక్నాలజీ మాదిరి పనిచేస్తుంది.ప్రమాద సమయంలో హెల్మెట్ నుంచి బయటకు వచ్చి తలకు ఎక్కువ గాయాలు కాకుండా కాపాడటంలో ఇది సహకరిస్తుంది.అయితే ఈ హెల్మెట్ మార్కెట్లో ఎప్పుడు లాంచ్ అవుతుంది అనే వివరాలను కంపెనీ ఆఫీసియల్ గా ప్రకటించలేదు.

అలాగే ఈ హెల్మెట్ భారతీయ మార్కెట్లో విడుదలవుతుందా.లేదా అనే విషయం కూడా ఖచ్చితంగా తెలియదు.

ఈ రకమైన ఎయిర్ బ్యాగ్ కలిగిన హెల్మెట్ భారతీయ మార్కెట్లో కూడా విడుదలయితే చాలా అనుకూలంగా ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube