Kamal r khan rrr : ఆర్ఆర్ఆర్ వల్ల నిర్మాతలకు 200 కోట్ల నష్టం.. క్రిటిక్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీ ఖ్యాతి ఊహించని స్థాయిలో పెరగడానికి కారణమైన సినిమాలలో ఆర్ఆర్ఆర్ ఒకటనే సంగతి తెలిసిందే.ఈ సినిమా వల్ల రాజామౌళికి ఏ స్థాయిలో ప్రశంసలు దక్కాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

 Kamal R Khan Sensational Comments About Rrr Movie Details Here , Kamaal R Khan-TeluguStop.com

అయితే ప్రముఖ సినీ విమర్శకులలో ఒకరైన కేఆర్కే మాత్రం ఆర్ఆర్ఆర్ సినిమాపై మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు చేయగా ఆ విమర్శలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆర్ఆర్ఆర్ వల్ల నిర్మాతలకు 200 కోట్ల నష్టం అంటూ కమల్ ఆర్ ఖాన్ షాకింగ్ కామెంట్లు చేశారు.

ఆర్ఆర్ఆర్ సినిమా నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చిందని ఆయన చెప్పుకొచ్చారు.ఈ ఏడాది టాప్5 డిజాస్టర్లలో ఆర్ఆర్ఆర్ ఒకటని కేఆర్కే చెప్పుకొచ్చారు.ఆర్ఆర్ఆర్ మూవీ ఫుల్ రన్ లో 1200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా వల్ల నిర్మాత దానయ్యకు 200 కోట్ల రూపాయలకు పైగా లాభాలు వచ్చాయి.

Telugu Ajay Devgn, Alia Bhatt, Japan, Kamal Khan, Rajamouli, Ram Charan, Tollywo

ఈ సినిమా కోసం చరణ్, ఎన్టీఆర్ పరిమితంగానే రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం.అయితే ఆర్ఆర్ఆర్ సినిమాపై విషం కక్కాలనే ఆలోచనతో కేఆర్కే ఈ విధంగా కామెంట్లు చేస్తున్నారని మరి కొందరు చెబుతున్నారు.ఎంతమంది చేత తిట్లు తిన్నా కేఆర్కే బుద్ధి మారలేదని మరలేదని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.రాజమౌళికి ప్రపంచవ్యాప్తంగా వస్తున్న గుర్తింపును తట్టుకోలేక కేఆర్కే ఈ విధంగా కామెంట్లు చేస్తున్నారని మరి కొందరు చెబుతున్నారు.

పబ్లిసిటీ కోసం కేఆర్కే ఎంతకైనా దిగజారుతారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.ఈ కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.కేఆర్కే చేసిన విమర్శల గురించి ఆర్ఆర్ఆర్ మూవీ నిర్మాతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.ఈ సినిమా అంచనాలను మించి ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube