తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోల పేర్లు చెప్పమంటే వారిలో పవన్ కళ్యాణ్ ప్రభాస్ పేర్లు తప్పకుండా ఉంటాయనే సంగతి మనకు తెలిసిందే.ఇలా వీరిద్దరూ స్టార్ హీరోలు అయినప్పటికీ వీరి మధ్య ఎలాంటి గొడవలు లేకపోయినా వీరి అభిమానుల మధ్య మాత్రం గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయని చెప్పాలి.
ముఖ్యంగా ఈ హీరోల సినిమాలు విడుదల సమయంలో ఒక హీరో అభిమానులు మరొక హీరో అభిమానులపై సోషల్ మీడియా వేదికగా వార్ ప్రకటిస్తూ పెద్ద ఎత్తున రచ్చ చేస్తూ ఉంటారు.
ఇలా వీరిద్దరూ అభిమానుల మధ్య గొడవలు ఉన్నప్పటికీ హీరోలు మాత్రం ఎంతో సఖ్యతతో ఉంటారు.
ఇక ఒకరి సినిమాలకు ఒకరు ప్రశంసలు కురిపించుకోవడం అభినందించుకోవడం వంటివి జరుగుతూ ఉంటాయి.ఈ క్రమంలోనే తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ సుజిత్ సినిమా ప్రకటించిన విషయం మనకు తెలిసిందే.
ఈ విధంగా వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ప్రకటించడంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.ఈ క్రమంలోనే ఎంతోమంది సెలబ్రిటీలు ఈ సినిమాపై స్పందిస్తూ తమదైన శైలిలో కామెంట్లు చేశారు.
ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ సుజిత్ సినిమా గురించి ప్రభాస్ ఇన్స్టాగ్రామ్ వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.ఈ క్రమంలోనే ప్రభాస్ ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ముందుగా చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపిన అనంతరం పవన్ కళ్యాణ్ గారు, సుజిత్ కి శుభాకాంక్షలు ఈ కాంబినేషన్ కచ్చితంగా హిట్ అవుతుంది.దానయ్య గారు, సినిమా బృందానికి శుభాకాంక్షలు” అంటూ ప్రభాస్ స్టోరీ పోస్ట్ చేశాడు.ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ పోస్టుపై డివివి ఎంటర్టైన్మెంట్ స్పందిస్తూ థాంక్యూ ప్రభాస్ గారు అంటూ రిప్లై ఇచ్చారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.