తెలుగు రాష్ట్రాల్లో ఐటీ అధికారుల దాడులు కలకలం రేపుతున్నాయి.ఏపీ, తెలంగాణలో వంశీరామ్ బిల్డర్స్ టార్గెట్ గా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.
ఇందులో భాగంగా హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ తో పాటు హైటెక్ సిటీలో అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.వంశీరామ్ బిల్డర్స్ ఛైర్మన్ సుబ్బారెడ్డి కార్యాలయం, సుబ్బారెడ్డి బావమరిది జనార్థన్ రెడ్డి నివాసాల్లో ఐటీ సోదాలు నిర్వహిస్తోంది.
అటు ఏపీలోని విజయవాడలోనూ ఐటీ దాడులు నిర్వహిస్తోంది.వైసీపీ నేత దేవినేని అవినాష్ ఇంట్లోనూ ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి.
బంజారాహిల్స్ లోని తన భూమిని వంశీరామ్ బిల్డర్స్ కు డెవలప్ మెంట్ కు అవినాష్ ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు.ఈ భూమిపై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే.