మానవ శరీరంలో జీర్ణ వ్యవస్థ అనేది ఎంతో ముఖ్యమైనది.జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తేనే మనిషి మనుగడ కూడా సరిగ్గా ఉంటుంది.
జీర్ణ వ్యవస్థ మాదిరిగా రక్తప్రసరణ కూడా మానవ శరీరంలో ఎంతో ముఖ్యమైనది.రక్తనాళాల ద్వారా రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది.
రక్తప్రసరణకు ఏ చిన్న అడ్డంకి వచ్చినా కూడా గుండె సమస్యలు మొదలయ్యే అవకాశం ఉంది.అందుకే రక్తనాళాలు ఎప్పుడూ సరిగ్గా పనిచేసే విధంగా ఉండటం మంచిది.
అందుకోసం ఆహారపు అలవాట్లు మరియు ఇతర కారణాలవల్ల రక్తనాళాల అడ్డంకులు తొలగించుకోవాలి.ముఖ్యంగా రక్తనాళాల్లో ఏర్పడే అధిక కొవ్వు వల్ల జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
రక్తప్రసరణ కు అడ్డుపడే అధిక కొవ్వు లేదా వ్యర్థ పదార్థాల నుండి బయటపడడానికి వైద్యుల దగ్గరికి వెళ్లి చికిత్స చేసుకోవడం కంటే మన ఇంట్లోనే కొన్ని చిన్న చిన్న చిట్కాలను ఉపయోగించి సులభంగా రక్తనాళాలను శుభ్రం చేసుకునే విధానం ఇప్పుడు తెలుసుకుందాం.రక్తనాళాల్లో ఉన్న వివిధ పదార్థాలకు ముఖ్యంగా గ్రీన్ టీ అద్భుతంగా పనిచేస్తుంది.
గ్రీన్ టీ లో ఉన్న కారణంగా రక్తనాళాల్లో ఉన్న కొవ్వు సులభంగా కరిగిపోతుంది.గ్రీన్ టీ ని ఎక్కువగా తాగే వారు బరువు కూడా త్వరగా తగ్గుతారు.
కొవ్వు తగ్గించుకోవడానికి గ్రీన్ టీ అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది.గ్రీన్ టీ రెగ్యులర్గా తాగే వారిలో గుండెపోటు వచ్చే అవకాశం తక్కువ అని వైద్య నిపుణులు చెబుతున్నారు.

శరీరంలోని వ్యర్ధాలను ఆలివ్ ఆయిల్ తొలగిస్తుందని చాలామంది వైద్య నిపుణులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.ఎన్నో ప్రయోగాల్లో కూడా రక్తనాళాల్లో ఉన్న వ్యర్ధాలను ఆలివ్ ఆయిల్ తొలగిస్తుందని ఒక అధ్యయనంలో తేలింది.అందుకే ప్రతి ఒక్కరు కూడా ఆలివ్ ఆయిల్ ను ఎప్పుడూ ఆహారంలో భాగం చేసుకోవడం మంచిదని చెబుతున్నారు.అంతేకాకుండా పసుపు మరియు అల్లం లో కూడా రక్తనాళాలను శుభ్రం చేసే గుణాలు ఉన్నాయి.
అందువల్ల ప్రతిరోజు ఆహారంలో పసుపు మరియు అల్లం ఉండేలా చూసుకోవాలని పెద్దవారు చెబుతూ ఉంటారు.ఇంకా చెప్పాలంటే రోజుకు ఆపిల్ తినడం వల్ల కూడా రక్తప్రసరణ బాగా జరిగే అవకాశం ఉంది.