టీఆర్ఎస్ ప్రభుత్వం వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు.శాంతిభద్రతల పేరుతో పాదయాత్రను అడ్డుకుంటున్నారన్నారు.
ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతుంటే దాడులా అని ప్రశ్నించారు.తనను మరదలు అంటూ కించపర్చడం వ్యక్తిగత దూషణ కాదా అని అడిగారు.
తన పాదయాత్రతో సీఎం కేసీఆర్ లో వణుకు పుడుతోందన్న షర్మిల టీఆర్ఎస్ అవినీతిని చూపిస్తుంటే తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు.పోలీసులను పార్టీ కార్యకర్తలుగా వాడుకుంటున్నారని ఆరోపించారు.
తనకు ప్రాణహాని ఉందని తెలిపారు.వైఎస్ఆర్ టీపీ పైకి రాకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన బస్సును కాల్చింది వాళ్లు.తానేందుకు క్షమాపణ చెప్పాలని ప్రశ్నించారు.
తన మీద దాడులు జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు షర్మిల తెలిపారు.