టీడీపీ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి ఏపీ ప్రభుత్వంపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.ఇటీవల ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వరి పండిస్తేనే వ్యవసాయం చేసినట్టు అనే ధోరణి కలిగిన రైతులు అటువంటి ఆలోచన నుండి బయట పడాలని తెలిపారు.
రైతులంతా వరి పంట వేస్తే కొనుగోలు చేయటం ప్రభుత్వానికి భారం అని పేర్కొన్నారు.దీంతో వరి పంట వేస్తే కొనుగోలు భారం అని కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఖండించారు.
కాకాని మరియు కన్నబాబు ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ మూతబడిందని విమర్శించారు.ఇదే సమయంలో దేశంలో పత్తి రైతులే ఎక్కువ ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వెల్లడించారు.రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్ లో కంటే తెలంగాణ రైతులే ఎక్కువ వరి పండించారని తెలియజేశారు.వైసిపి హయాంలో రైతులు రోడ్లపైకి వస్తున్నారని అనేక ఇబ్బందులు పడుతున్నారని ఏపీ ప్రభుత్వంపై సీరియస్ కామెంట్లు చేశారు.
యాంత్రికరణ, భూసార పరీక్షలు, బిందు సేద్యం ఆగిపోవడం దురదృష్టకరమని సోమిరెడ్డి చెప్పుకొచ్చారు.