పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అంటే ముందుగా గుర్తుకు వచ్చేది మాత్రం బండ్ల గణేష్ నే.ఈయనకు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నప్పటికీ బండ్లన్న ప్రత్యేకత చాటుకున్నారు.
పవన్ సినిమా ఈవెంట్ అంటే ఈయన స్పీచ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తుంటారు.ఈయన పవన్ కు హార్డ్ కొర్ ఫ్యాన్ గా టాలీవుడ్ లో నిలిచి పోయాడు.
అయితే తాజాగా మరోసారి బండ్లన్న పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సినిమాపై స్పందించారు.
సోషల్ మీడియా వేదికగా తనదైన శైలిలో స్పందించి మరోసారి పవన్ మీద అభిమానాన్ని చాటుకున్నారు.
ఈ రోజు పవన్ కళ్యాణ్ మరో సినిమాను అనౌన్స్ చేసి అందరికి షాక్ ఇచ్చాడు.దిగ్గజ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటెర్టైనమెంట్స్ నుండి ఒక క్రేజీ అనౌన్స్ మెంట్ రావడంతో అంతా ఆశ్చర్య పోయారు.
పవన్ కళ్యాణ్ మరియు యంగ్ డైరెక్టర్ సుజీత్ కాంబోలో సినిమా ఉంది అని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి.
అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఇప్పుడు అఫిషియల్ అనౌన్స్ మెంట్ రావడంతో అంతా ఆశ్చర్య పోతున్నారు.
ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో ఈ సినిమాను అనౌన్స్ చేసారు.దీంతో ఈ సినిమా అఫిషియల్ గా కన్ఫర్మ్ అవ్వడంతో పవన్ ఫ్యాన్స్ అంతా ఖుషీగా ఉన్నారు.
అయితే ఈ సినిమా అధికారికంగా ప్రకటించడంతో ఈ ప్రాజెక్ట్ మీద పవన్ వీరాభిమాని సోషల్ మీడియా వేదికగా స్పదించారు.

”భారత చలన చిత్ర పరిశ్రమలో నంబర్ వన్ చిత్రంగా నిలవాలని నిలిచే విధంగా రూపొందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బండ్ల గణేష్” అంటూ తనదైన శైలిలో తన దేవర కోసం స్పందన అందించారు.దీంతో బండ్ల గణేష్ మరోసారి వార్తల్లో నిలిచారు.ఈ మాసివ్ ప్రాజెక్ట్ అయితే డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.
మొత్తానికి పవన్, సుజీత్ కాంబోలో ఒక సెన్సేషన్ మూవీనే రాబోతుంది అని తెలుస్తుంది.మరి ఈ క్రేజీ సినిమా సెట్స్ మీదకు ఎప్పుడు వెళుతుందో చూడాలి.







