శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్యే బామ్మర్ది వివాదం రోజురోజుకు ముదురుతోంది.ఈ క్రమంలో ఎమ్మెల్యే బామ్మర్ది శ్రీధర్ రెడ్డి తీరుపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాకుండా కుమారుడు శ్రీధర్ రెడ్డిపై ఆయన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఆస్తి కోసం తనపై హత్యాయత్నం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
కాగా ఆస్తి విషయంలో కొంతకాలంగా ఇరు కుటుంబాల మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే నిన్న ఎమ్మెల్యే నివాసం ముందు హడావుడి చేసిన శ్రీధర్ రెడ్డి.
తన చేతులను బ్లేడ్ తో గాయపరుచుకున్నారు.అనంతరం పోలీసులపైనా దాడి చేసేందుకు ప్రయత్నించారు.







