Kantara movie rishabh shetty : ఎట్టకేలకు వరాహ రూపం పాట వివాదంపై స్పందించిన రిషబ్ శెట్టి?

కన్నడ హీరో రిషబ్ శెట్టి హీరోగా ఆయన దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కాంతార.ఈ సినిమా కన్నడ భాషలో విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో తిరిగి ఇతర భాషలలో కూడా ఈ చిత్రాన్ని డబ్ చేశారు.

 Rishabh Shetty Finally Responded To The Varaha Form Song Controversy Kantara Mov-TeluguStop.com

కేవలం 16 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అన్ని భాషలలో సుమారు 400 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టి రికార్డు సృష్టించింది.ఈ సినిమాతో రిషబ్ శెట్టి పేరు పాన్ ఇండియా స్థాయిలో మారుమోగిపోతుంది.

ఇక ఈ సినిమా చూసినటువంటి ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖులు సినిమాపై పెద్ద ఎత్తున ప్రశంశల వర్షం కురిపించారు.ఇక ఈ సినిమా ఎంతో అద్భుతమైన విషయాన్ని అందుకున్నప్పటికీ ఈ సినిమాలో వరాహ రూపం పాట విషయంలో మాత్రం పెద్ద ఎత్తున వివాదం చెలరేగిన సంగతి మనకు తెలిసిందే.

వరాహ రూపం ట్యూన్ తైక్కుడం బ్రిడ్జ్ అనే మ్యూజిక్ సంస్థ నవరసం పాట ట్యూన్ కాపీ కొట్టారంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Telugu Kannada, Kantara, Kerala, Kollywood, Rishab Shetty-Movie

ఈ క్రమంలోనే ఈ విషయంపై స్పందించిన కేరళ హైకోర్టు కాంతార సినిమాలో ఈ పాటను తొలగించాలని తీర్పు చెప్పారు.అయితే ఇప్పటివరకు ఈ విషయంపై కాంతార చిత్ర బృందం ఎక్కడ స్పందించలేదు.ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రిషబ్ శెట్టి ఈ విషయం గురించి స్పందించారు.

ముందుగా కాంతర సినిమాకి ఇంత మంచి సక్సెస్ అందించిన ప్రేక్షకులకు ఈయన ధన్యవాదాలు తెలియజేశారు.అదేవిధంగా వరాహ రూపం పాట గురించి మాట్లాడుతూ ప్రస్తుతం కేరళ హైకోర్టులో ఈ పాట గురించి విచారణ జరుగుతుంది.

అయితే అక్కడ ఈ పాట విషయంలో ఏదో ఒక తీర్పు వచ్చిన తర్వాతే ఈ విషయంపై మనం మాట్లాడాల్సి ఉంటుంది అంటూ స్పందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube