Sharukhkhan Mecca: మక్కాలో సందడి చేసిన షారుక్.. ఫోటోలు వైరల్!

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ హీరోగా నటించిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి చాలా కాలం అయింది.అయితే ఈ రోజు సినిమాల కోసం అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

 Bollywood Star Hero Sharukh Khan Visits Mecca Saudi Arabia Details, Shah Rukh ,-TeluguStop.com

ప్రస్తుతం రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా మరొక సినిమా కూడా షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది.ప్రస్తుతం ఈయన పఠాన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

ఈ సినిమా జనవరి 25వ తేదీ విడుదల కానుంది.

ఈ సినిమాతో పాటు కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో జవాన్ అనే సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో షారుక్ ఖాన్ సరసన నయనతార నటించనున్నారు.ఈ సినిమా కూడా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.ఈ సినిమాతో పాటు షారుక్ ఖాన్ రాజ్‌కుమార్ హిరాణి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.‘డుంకి’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం సౌదీ అరేబియాలో షూటింగ్ పనులను జరుపుకుంటుంది.ఇక ఈ సినిమా షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి కావడంతో ముస్లింల పవిత్ర నగరమైన మక్కాను సందర్శించారు.

ఇకపోతే షారుక్ ఖాన్ సౌదీ అరేబియా ఆతిథ్యం గురించి ఆ దేశ కల్చరల్ మినిస్ట్రీకి కృతజ్ఞతలు తెలుపుతూ ఓ వీడియో షేర్ చేశాడు.అనంతరం గురువారం మక్కా సందర్శించుకున్నారు.ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నాలుగు సంవత్సరాలుగా షారుక్ నటించిన ఏ ఒక్క సినిమా విడుదల కాకపోవడంతో అభిమానులు పఠాన్ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube