బేసిగ్గా ఎవ్వరూ పిలవని పేరంటానికి వెళ్ళడానికి ఇష్టపడరు.అదొక అవమానకరంగా భావిస్తారు.
సొంత చుట్టాళ్ళైనా సరే పిలవడం మర్చిపోతే వారి శుభకార్యాలకు వెళ్ళడానికి జంకుతారు.అయితే కొంతమంది మాత్రం ఇలాంటివేమీ పట్టించుకోకుండా వెళ్లిపోతుంటారు.
ముఖ్యంగా భోజన ప్రియులైతే మాత్రం ఇక ఆగలేరు.పైగా పెళ్లి విందు అయితే మాత్రం వెళ్లి ఓ పట్టు పట్టాలని అనుకుంటారు.
అయితే ఇలాంటి అనుభవం మీకు ఒక్కసారైనా కలిగే ఉంటుంది.లేదంటారా? ఒక్కసారి మీ స్టూడెంట్ లైఫ్ లోకి తొంగి చూస్తే ఇలాంటి ఆకతాయి అనుభవాలు ఎన్నో ఉంటాయి.
ఇక్కడ కూడా అదే జరిగింది.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో పిలవని పేరంటానికి వెళ్ళాడొక యువకుడు.వెళ్లి ఎంచక్కా కడుపునిండా తిన్నాడు.అయితే సదరు పెళ్ళివారు ఆ యువకుడిని గురించి పట్టుకున్నారు.
భోనమే కదా అని వారు ఊరుకోలేదు, కడుపు నిండా హోటల్ లో తిని బిల్లు చెల్లించడానికి డబ్బులు లేకపోతే ప్లేట్లు కడగమని పురమాయిస్తారు చూడండి… ఇక్కడ కూడా అదే చేసారు.ఈ సరదా సన్నివేశం మధ్యప్రదేశ్ లో చోటు చేసుకోగా తాజాగా వెలుగు చూసింది.

వీడియో పరిశీలిస్తే చూడవచ్చు.ఈ వీడియోలో ఒకరు ప్రశ్నిస్తుండగా… ఆ యువకుడు తాను పిలవకుండానే పెళ్లికి వెళ్లి భోజనం చేసినట్లు చెప్పాడు.అంతేకాకుండా తాను జబల్పూర్ నివాసి అని, భోపాల్ లో ఒక కాలేజీలో MBA చేస్తున్నానని కూడా చెప్పడం కొసమెరుపు.ఉచితంగా ఇలా ఆహారాన్ని తిని.తన తల్లిదండ్రులు డబ్బులు పంపొద్దు అంటూ చెబుతున్నట్లు తెలుస్తోంది.ఈ వీడియోను @AshwiniSahaya అనే ఖాతా ద్వారా ట్విట్టర్‌లో షేర్ చేయగా తెగ వైరల్ అవుతోంది.
ఇప్పటివరకు ఈ వీడియో లక్షల్లో వీక్షణలు, వందల సంఖ్యలో లైక్‌లను సొంతం చేసుకుంది.అయితే నెటిజన్లు పెళ్ళిలో ఎంతో ఆహారం వేస్ట్ అవుతుంది.
ఇలాంటి వ్యక్తులకు ఉచితంగా అందించండి.కామెంట్ చేయడం కొసమెరుపు.







