న్యాచురల్ స్టార్ నాని వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.ఈయన సినిమాల్లో నటిస్తూనే మరో పక్క నిర్మాతగా కూడా రాణిస్తున్నాడు.
ఈయన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నిర్మించిన సినిమాల్లో హిట్ 1 ఒకటి.విశ్వక్ సేన్ హీరోగా 2020 లో తెరకెక్కి బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ రాబట్టి సూపర్ హిట్ అనిపించు కుంది.
ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించాడు.
ఈ సినిమా ఘన విజయం సాధించడంతో ఇప్పుడు దీనికి సీక్వెల్ గా తెరకెక్కిన హిట్ 2 పై మరిన్ని అంచనాలు పెరిగాయి.
అందుకే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరుపుకుంది.అయితే ఈసారి హీరోగా విలక్షణ హీరో అడవిశేష్ నటిస్తున్నాడు.క్షణం, గూఢచారి వంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత అడవి శేష్ అంటే అందరికి తెలిసింది.ఈయన సినిమా అంటే ఏదొక స్పెషల్ కంటెంట్ ఉంటుంది అని నమ్ముతున్నారు.
ఇటీవలే మేజర్ సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు.ఈ సినిమా అన్ని చోట్ల మంచి కలెక్షన్స్ అందుకుని మంచి సక్సెస్ దక్కడంతో ఈయన క్రేజ్ మరింత పెరిగింది.
మరి అడవి శేష్ క్రేజ్ కూడా ఈ సినిమాపై అందరికి ఇంట్రెస్ట్ కలిగేలా చేసింది.హిట్ 2 ఈ రోజు గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.
ముందు నుండి మంచి అంచనాలు ఉన్న ఈ సినిమా ఓపెనింగ్స్ కూడా బాగానే రాబట్టే అవకాశం ఉంది అని అంటున్నారు.
ఇదిలా ఉండగా ఈ సినిమా ఇప్పుడు ఓటిటి పార్ట్నర్ ను కూడా లాక్ చేసుకున్నట్టు సమాచారం.ఈ క్రమంలోనే ఈ సినిమా ఓటిటి పార్ట్నర్ ఎవరు అనే దానిపై ఒక క్లారిటీ వచ్చింది.ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది.
హిట్ 1 ను కూడా వీరే కొనుగోలు చేయగా ఇప్పుడు హిట్ 2 ఫ్రాంచైజ్ ను కూడా వీరే దక్కించు కోవడం విశేషం.చూడాలి ఈ సినిమాతో నాని లాభాలు అందుకుంటాడో లేదో.