Ashu Reddy : బాత్ టబ్ ఫోటోలను షేర్ చేసిన ఆషు... నువ్వు మారవుంటున్న నేటిజన్స్!

సోషల్ మీడియా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ఇండస్ట్రీలో సెలబ్రిటీలుగా కొనసాగుతున్న వారిలో బిగ్ బాస్ బ్యూటీ ఆషు రెడ్డి ఒకరు.ఈమె టిక్ టాక్ వీడియోలు, డబ్ స్మాష్ వీడియోల ద్వారా ఎంతో పాపులర్ అయ్యారు.

 Ashu Shared Bathtub Photos , Ashu ,bathtub Photos ,bigg Boss Beauty Ashu Reddy-TeluguStop.com

ఇక ఈమెను జూనియర్ సమంత అంటూ పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపించడంతో ఈమె తన వీడియోలతో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో రెచ్చిపోయారు.ఇలా సోషల్ మీడియా ద్వారా ఈమె చేసే హంగామా మామూలుగా ఉండదు.

ఇలా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న అశు రెడ్డి ఏకంగా రెండుసార్లు బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు.

ఇలా బిగ్ బాస్ కార్యక్రమాల ద్వారా మరింత మంది అభిమానులను సంపాదించుకున్న ఈమె ఈ కార్యక్రమం అనంతరం పలు బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేయడమే కాకుండా వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించి సందడి చేసేవారు.

ఇక ఆశు రెడ్డి సోషల్ మీడియాలో చేసే రచ్చ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే.పొట్టి పొట్టి దుస్తులను ధరించి అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు.

గత రెండు రోజుల క్రితం వరకు ఈమె బెడ్ రూమ్ ఫోటోలను షేర్ చేస్తూ పెద్ద ఎత్తున రచ్చ చేశారు.

Telugu Ashu, Bathtub, Bigg Boss, Biggboss-Movie

ఇలా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ ఫోటోలను షేర్ చేసే అశు రెడ్డి తాజాగా బాత్రూం వీడియోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఈ క్రమంలోనే బాత్రూంలో బాత్ టబ్ లోస్నానం చేస్తూ ఉన్నటువంటి వీడియోలతో పాటు కొన్ని ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి.దీంతో ఎంతోమంది నెటిజన్ లు ఈ ఫోటోలపై తమదైన శైలిలో స్పందిస్తూ ఈమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చివరికి బాత్రూంలో ఫోటోలను కూడా షేర్ చేయాలా అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు మాత్రం ఈ జన్మకు నువ్వు మారవు అంటూ కామెంట్లు చేస్తున్నారు.మొత్తానికి అశు రెడ్డి బాత్ టబ్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube