టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ కౌర్ తన లేటెస్ట్ ఫోటోలతో అందరికి షాక్ ఇచ్చింది.అమ్మడు మొహం నిండా సూదులతో గుచ్చుకుని ఉన్న ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది మెహ్రీన్.
ఆ ఫోటోలు చూసిన ఆమె ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ అయ్యో మెహ్రీన్ కౌర్ కి ఏమైంది అంటూ కంగారు పడుతున్నారు.అయితే మెహ్రీన్ ఇదంతా తన అందాన్ని పెంచుకోడానికి అలా చేసిందట.
ఆక్యు పెంచర్ ట్రీట్ మెంట్ తో షాక్ ఇచ్చింది మెహ్రీన్.ఆక్యు స్కిన్ లఫ్ట్ లో భాగంగా అలా మొహం నిండా సూదులు గుచ్చేసుకుంది అమ్మడు.
అందంగా కనిపించడానికి ఇంత కష్టపడాలా అంటూ ఆమెపై కామెంట్స్ చేస్తున్నారు ఆడియన్స్.ఆక్యుపంచర్ ట్రీట్ మెంట్ అలానే ఉంటుంది.సూదులతో చేసే ఆ ట్రీట్ మెంట్ వల్ల ఫలితం బాగానే ఉంటుంది కానీ ఆ సూదుల నొప్పులను భరించాల్సి ఉంటుంది.మొహం నిండా సూదులతో ఆడియన్స్ ని షాక్ అయ్యేలా చేసింది మెహ్రీన్.ఆమెని అలా చూసి అయ్యో అని జాలి చూపిస్తున్నారు ప్రేక్షకులు.F3 తర్వాత మరో సినిమా ఛాన్స్ దక్కించుకోని మెహ్రీన్ ఖాళీ టైం ని బ్యూటీ మీద దృష్టి పెట్టింది.