Waltair Veerayya Veera Simha Reddy : రెండు బిగ్ సినిమాల పాటలు అట్టర్ ఫ్లాప్..కాపీ పేస్ట్ కూడా..

తెలుగు ఇండస్ట్రీలో సంక్రాంతి జోరు భారీగా ఉంటుంది.చిన్న చిన్న సినిమాల దగ్గరి నుంచి పెద్ద హీరోల దాకా సంక్రాతి బరిలోకి దిగడానికి సిద్ధమవుతుంటారు.

మరో విచిత్రం ఏంటంటే.సంక్రాంతికి ఎలాంటి సినిమా వచ్చినా.

హిట్ అయి కూర్చుంటుందనే టాక్ సైతం నడుస్తోంది.దాంతో ఈ సారి బడా హీరోలు సంక్రాంతి పై కన్నేశారు.

అటు బాలయ్య, ఇటు చిరంజీవి ఇద్దరూ సై అంటే సై అన్నట్టు దూసుకు వస్తున్నారు.సినిమా పేర్లలో అయితే పస కనిపిస్తోంది.

Advertisement

కానీ పాటల్లో మాత్రం పస కనిపించడం లేదంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.ఈ ఇద్దరి సినిమాలపై అంచనాలు భారీగా ఉన్నాయి.

చిరంజీవి "వాల్తేర్ వీరయ్య", బాలకృష్ణ "వీర సింహారెడ్డి" రెండింటికీ నిర్మాత ఒక్కరే.అదే మైత్రీ మూవీస్ బ్యానర్.

ఒకే సీజన్లో తమ రెండు సినిమాలు విడుదల చేయడం వల్ల రమారమి 15 నుంచి 20 కోట్ల వరకు నష్టమొస్తుందని ఒక అంచనా ఉంది.అయినా వాళ్లకి తప్పట్లేదు.

ఎందుకంటే ఇద్దరు హీరోలకీ సంక్రాంతే కావాలి.నిర్మాత గోల వాళ్లకి అనవసరం.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

హీరోల తలనొప్పులను భరించి.చేసేది లేక మైత్రీ బ్యానర్ సంక్రాంతి సీజన్లోనే రెండు సినిమాలూ నష్టానికి సిద్ధపడే విడుదల చేస్తున్నారు.

Advertisement

అయితే ఇప్పుడు వాళ్ల చేతుల్లో ఉన్నది ఒకటే దారి.రెండు సినిమాలకి విపరీతమైన బజ్ తీసుకురావాలి.

అభిమానుల మధ్య మా హీరో సినిమా గొప్పదంటే మా హీరో సినిమా గొప్పదనే పోటీ తీసుకురావాలి.అప్పుడే రెండింటికీ గిరాకీ పెరిగి రెండూ బాగా ఆడే అవకాశముంది.

అప్పుడు వారికి వస్తుందని అనుకుంటున్న నష్టాన్ని ఎంతో కొంత భర్తీ చేసుకోవచ్చు.అలా కాకుండా ఇప్పుడున్న పరిస్థితిలో ఏ ఒక్క సినిమాకి కాస్త బజ్ తగ్గినా నష్టం అనుకున్నదానికంటే ఎక్కువగా ఉంటుంది.

రెండింటికీ కావాల్సినంత బజ్ రాకపోతే నిర్మాత నెత్తిమీద రెండు పిడుగులు ఒకేసారి పడినట్టే అవుతుంది.సినిమాల బజ్ కోసం వాల్తేర్ వీరయ్య నుంచి మొన్న విడుదలైన "బాస్ పార్టీ" పాట కానీ, "వీర సింహా రెడ్డి" నుంచి విడుదలైన "జై బాలయ్య" పాట కానీ బజ్ తీసుకురాకపోగా నెగటివిటీని మూటగట్టుకున్నాయి.

"బాస్ పార్టి" అనే పాట ఎప్పుడో సింబు నటించిన తమిళ సినిమా "సిలంబాట్టన్" అనే సినిమాలోని "వేరీజ్ ద పార్టీ" లా ఉందని ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి.ట్యూన్ కాపీ కాకపోయినా కాన్సెప్ట్ అదే అనే టాక్ నడుస్తోంది.అంతే కాకుండా ఈ పాటలో కూడా "వేరీజ్ ద పార్టీ" యాజిటీజ్ గా ఉంది.

ట్యూన్ ఒరిజినలే అనుకున్నా పాటకు రాసిన సాహిత్యమైతే అత్యంత పేలవంగా చాలా సాధారణ స్థాయిలో ఉంది తప్ప దేవీశ్రీప్రసాద్ రాసినట్టు లేదు.నిజానికి దేవి అప్పుడప్పుడు కలం విదిలించి మంచి పాటలే రాస్తుంటాడు.

దేవీశ్రీప్రసాద్ తెలుగు, తమిళ భాషల్లో కలిపి దాదాపు 30 వరకు సినిమా పాటలు రాసాడు.కానీ "బాస్ పార్టీ" మాత్రం ఎప్పుడూ లేనంత బ్యాడ్ గా రాసి రిస్క్ చేసాడు.

చేసిన ట్యూన్ ఎలా ఉన్నా లిరిక్ సరిగా ఉంటే బాగుండేది.రెండింటిలోనూ ఫెయిలయ్యాడు దేవి.

ఇక తమన్ విషయానికొస్తే "జై బాలయ్య" పాటతో ఛీకొట్టించుకుంటున్నాడు.ఎప్పుడో 1990ల నాటి వందేమాతరం శ్రీనివాస్ స్వరపరిచి పాడిన "ఓసేయ్ రాములమ్మ" పాట ట్యూనుని ఎత్తేసి తిరగమోతేసి పెనం మీదనుంచి దింపాడు.మరో వైపు ఈ పాటలో రామజోగయ్య శాస్త్రి హస్తం కూడా ఉంది.

సీనియర్ గీత రచయిత అయ్యుండి కూడా ఇప్పుడే ఫీల్డులోకొచ్చిన ఎంట్రీలెవెల్ గీత రచయితలాగ రాసాడని నెటిజన్లు మండిపడుతున్నారు.మరి ముందు ముందు వచ్చే పాటలైనా.ఆకట్టుకుంటే.

సంక్రాంతికి అనుకున్న కలెక్సన్లు వస్తాయి.లేదంటే ఇప్పటి నుంచే నష్టాన్ని అంచనా వేసుకోవాల్సి ఉంటుందని ఫాన్స్ తెగ ఫీలై పోతున్నారు.

" autoplay>

తాజా వార్తలు