ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో నిందితులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.ఈ మేరకు నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజిలు తమకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ ను న్యాయస్థానం రేపు విచారించనుంది.కాగా బెయిల్ పిటిషన్ ను పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే.
ఇప్పటికే నిందితుల బెయిల్ పిటిషన్ ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది.అదేవిధంగా నిందితుల రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
డిసెంబర్ 9 వరకు రిమాండ్ పొడిగింపు కావడంతో రామచంద్రభారతి, నందు, సింహయాజిలను పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు.







