టాలీవుడ్ లో స్టార్ హీరోలంతా కూడా నెత్తి మీద జుట్టు లేకపోయినా సైడ్ క్రాఫ్ తో కానీ.విగ్స్ తో కానీ మ్యానేజ్ చేస్తున్నారు.
లోపల ఎలా ఉన్న బయటకు మాత్రం ఎంతో స్మార్ట్ గా కనిపిస్తూ ఆకట్టు కుంటున్నారు.మరి వారు నిజమైన జుట్టుతో ఉన్నారో లేదంటే విగ్గుతో ఉన్నారో అనేది కూడా తేల్చుకోలేక పోతున్నారు.
బయట వాళ్ళ ఒరిజినాలిటీ చాలా మంది బయట పెట్టరు.సూపర్ స్టార్ రజినీకాంత్ మాత్రం బాల్డ్ హెయిర్ తోనే బయటకు కూడా వస్తారు.ఈయన లాగా మరే హీరో కూడా తమ ఒరిజినాలిటీ బయట పెట్టలేదు.అయితే ఇక్కడ మరొకరి గురించి చెప్పుకోవాలి.
ఆయనే డైరెక్టర్ క్రిష్.ఈయన కూడా మిగతా వారికంటే అతీతంగానే ఉంటారు.అసలు అందం గురించి అంటేనే ఈయన పట్టించుకోడు.
ఎలా ఉన్న బయట అలానే తిరుగుతాడు.
కెరీర్ మీద తప్ప తన ఫోకస్ మరల్చడు.ఇక ఈయన పెళ్లి సమయంలో కూడా ఎలా ఉన్నాడో అలానే కనిపించాడు.
అయితే తాజాగా ఈయన లుక్ అందరికి షాక్ ఇచ్చింది అనే చెప్పాలి.ఎందుకంటే క్రిష్ తన ఒరిజినాలిటీ లో కాకుండా కాస్త డిఫెరెంట్ మేకోవర్ తో అలరిస్తున్నాడు.
దీంతో క్రిష్ కొత్త మేకోవర్ చూసిన వారంతా ఈయన ఆయనేనా? అనే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా అతడి బాల్డ్ హెయిర్ మాయం అయ్యి నిండుగా ఉన్న హెయిర్ తో కనిపిస్తున్నాడు.కెరీర్ పరంగా కాస్త బ్రేక్ దొరకగానే క్రిష్ మేకోవర్ మీద ద్రుష్టి పెట్టినట్టు అనిపిస్తుంది.తాజాగా వైరల్ అయిన ఫొటోలో చిరు, పవన్ దేని గురించో మాట్లాడు కుంటున్న సమయంలో క్రిష్ ఆ ఇద్దరి పక్కనే నిల్చుని కనిపించారు.
ఈ పిక్ లోనే క్రిష్ జుట్టుతో కనిపిస్తున్నాడు.అయితే ఇది విగ్ లాగా అనిపించడం లేదు.దీంతో ఈయన హెయిర్ ట్రీట్ మెంట్ తీసుకుని ఉంటాడు అని అనుకుంటున్నారు.







