టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నిర్మాత దిల్ రాజు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఎన్నో సినిమాలకు నిర్మాతగా బాధ్యతలు చేపట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి సక్సెస్ఫుల్ నిర్మాతగా ఓ రేంజ్ లో పరుగులు తీస్తున్నాడు.సొంతంగా సినిమాలకు నిర్మాత బాధ్యతలు చేపట్టమే కాకుండా ఇతర సినిమాలను కూడా తన బ్యానర్లో విడుదల చేస్తాడు.
ఇక ఆ సినిమాలు కూడా దిల్ రాజ్ కి మంచి సక్సెస్ ను అందించాయి.ఇక ప్రస్తుతం ఇతర భాషల సినిమాలను కూడా తన బ్యానర్ లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు దిల్ రాజు.
అయితే దీనివల్ల ఇప్పుడు ఆయనకు బాగా ట్రోల్స్ ఎదురవుతున్నాయి.ఇప్పటివరకు ఎటువంటి ట్రోల్స్ ఎదుర్కొని దిల్ రాజుకు ఈమధ్య బాగా ట్రోల్స్ ఎదురవుతున్నాయి.
ఇంతకూ అసలు విషయం ఏంటంటే.ఏదైనా పండగల సందర్భాలలో ముఖ్యంగా సంక్రాంతి, దసరా, దీపావళి సమయంలో స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతూ ఉంటాయి.
ఆ సమయంలో చిన్న హీరోల సినిమాలు కానీ, డబ్బింగ్ సినిమాలు కానీ విడుదల కావు.ఎందుకంటే పండగల సమయంలో స్టార్ హీరోల సినిమాలు పోటీకి వస్తాయి కాబట్టి.

అయితే రానున్న సంక్రాంతికి దిల్ రాజ్ ఇతర భాష సినిమాను తన బ్యానర్ లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.దీంతో ఆయనపై బాగా ట్రోల్స్ ఎదురవుతున్నాయి.ఇంతకూ అది ఏ సినిమా అంటే.వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న వారసుడు సినిమా.ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల చేయనున్నారు.
దీంతో ఈ సినిమాను తెలుగులో వారసుడుగా సంక్రాంతి ముందుకు తీసుకురావాలని దిల్ రాజ్ ప్లాన్ చేశాడు.
అంతేకాకుండా ఈ సినిమా కోసం ఆంధ్ర, తెలంగాణలో పెద్ద ఎత్తున థియేటర్లను కూడా బుక్ చేసినట్లు తెలుస్తుంది.దీని పట్ల తెలుగు ప్రేక్షకులు ఆయనపై బాగా మండిపడుతున్నారు.

ఇక తాజాగా తనపై వస్తున్న ట్రోల్స్ గురించి స్పందించాడు.ఇటీవల విడుదలైన మసూద సినిమా సక్సెస్ మీట్ లో దిల్ రాజ్ పాల్గొన్నాడు.ఈ సందర్భంగా వారసుడు సినిమా గురించి కూడా కొన్ని విషయాలు మాట్లాడాడు.ఇక.మసూద సినిమాపై దర్శకుడు కి ఎంత నమ్మకం ఉంది అంటూ సినిమా ఎవరికి నచ్చకపోయినా అంతే ధైర్యంతో విడుదల చేశాడు అని అన్నాడు.
అదే ఆయనకున్న సినిమా మీద ఫ్యాషన్ అని.దర్శకుడిగా ఆయనలోని ఆ కాన్ఫిడెన్స్ నాకు నచ్చింది అని అన్నాడు.అందుకే ఆయనకు మద్దతు ఇచ్చాను అంటూ తెలిపాడు.
తన గురించి చాలామంది రకరకాలుగా అంటున్నారు అని.కానీ తనలో మరో యాంగిల్ ఉంది అంటూ. అది ఎవరికి తెలియదంటూ.సినిమాను ప్రేమించి మంచి కంటెంట్ తో కథను చూపించే వాళ్లకోసం నేను ఏమి చేయడానికైనా రెడీగా ఉన్నాను.అందుకే మసూద సినిమాకు కూడా మద్దతు ఇచ్చాను అని అన్నాడు.

అంతేకాకుండా మంచి సినిమా కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని అన్నాడు.అద్భుతమైన సినిమాలను మన వాళ్లకు చూపించడానికి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను అని.అందుకే లవ్ టుడే సినిమా విడుదల చేస్తున్నాను అని.దానివల్ల ఒక్క రూపాయి కూడా మిగలదు అంటూ.కానీ సినిమా మీద ఉన్న ఫ్యాషన్ తో విడుదల చేస్తున్నాను అని అన్నాడు.
అంతేకానీ తనకు డబ్బులు వద్దంటూ.ఆయన డబ్బులతో ఏం చేసుకుంటాం అంటూ.చివరకు మిగిలేది ఏంటి అనేది మన అందరికీ తెలుసు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఆలోచిస్తున్నాను అని అంతేకాకుండా వారిసు థియేటర్స్ వివాదం గురించి కూడా అసలు ఏం జరుగుతుందో అన్న విషయాన్ని వివరిస్తాను అని అన్నాడు దిల్ రాజ్.







