తెలుగు సినీ ప్రేక్షకులకు ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రియ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలో తెలిసిన నటించిన స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది శ్రియ.
ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించిన శ్రియ ప్రస్తుతం ఆడపాదడపా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతోంది.అలాగే సమయం దొరికినప్పుడల్లా తన భర్త పిల్లలతో కలసి వెకేషన్ లు తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.
అందుకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
ఇదిలా ఉంటే ఇటీవల దృశ్యం 2 సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది శ్రియ.
అలాగే ఆర్ఆర్ఆర్ సినిమాలో కూడా చిన్న పాత్రలో నటించిన విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే ఇటీవల ఒక ఈవెంట్ కి తన భర్త ఆండ్రీ కొస్చివ్ తో కలిసి పాల్గొంది.
ఈ క్రమంలోనే అక్కడ ఫోటోలకు ఫోజులు ఇస్తూ స్టేజి పైనే భర్తకు ముద్దు పెట్టింది.అయితే శ్రియ చేసిన పనికి నెటిజన్స్ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్రోల్లింగ్ చేస్తున్నారు.
కాగా ఆ ట్రోలింగ్స్ పై శ్రియ ఈ విధంగా స్పందించింది.అది నాకు చాలా ప్రత్యేకమైన సందర్భం.
అయినా కెమెరా ముందు ముద్దు పెట్టుకుంటే తప్పేముంది.ఆండ్రీ కూడా దానిని చాలా సర్వసాధారణంగానే భావిస్తున్నాడు.

అయినా నా భర్తను నేను ముద్దు పెట్టుకుంటే తప్పేంటి.ఆ విషయానికి ఎందుకు ట్రోల్స్ చేస్తున్నారో అర్థం కావడం లేదు అంటూ శ్రియ ట్రోల్స్ పై స్పందించింది.శ్రియ స్పందించిన విధానం పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రతిసారి ఆ విధంగా ముద్దులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాను.కొందరు అలా పబ్లిక్ లో ముద్దు పెట్టుకోవడం తప్పు అని ఆమెను విమర్శిస్తున్నారు.







