కొన్ని కొన్ని సార్లు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు తాము ప్రవర్తించే తీరుపై విమర్శలు ఎదుర్కొంటారు.ఒక్కోసారి వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి అర్థం కాదు.
వాళ్ళు చేసే పనులు వాళ్ళకి నచ్చుతుందేమో కానీ చూసే ప్రజలకు చాలావరకు అవి నచ్చవు.సినిమాలో పాత్రల వరకే అవి బాగుంటాయి కానీ బయట కూడా అలాగే చేస్తాం అంటే చూసే ప్రజలు ఊరుకోరు.
ఇప్పుడు అటువంటి పరిస్థితే 80స్ హీరోలకు ఎదురయ్యింది.ఇంతకు అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.మామూలుగా నటీనటులు కొన్ని కొన్ని సార్లు కొన్ని వేడుకలు జరుపుకుంటూ ఉంటారు.ముఖ్యంగా ఒకప్పటి నటీనటులంతా సంవత్సరానికి ఒకసారి రీ యూనియన్ అనే వేడుకలను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.
ఒక్కో ఏడాది ఒక్కో స్టార్ ఇంట్లో ఈ పార్టీలను చేస్తూ ఉంటారు.సీనియర్ నటీనటులు అంతా ఒక దగ్గరికి చేరి ఒకప్పటి మెమరీస్ ను నెమరు వేసుకుంటారు.
అయితే తాజాగా ఈ ఏడాది ముగియనున్న సందర్భంగా బాలీవుడ్ నటుడు జాకీ ష్రాప్ ఇంట్లో 80స్ పార్టీ వేడుక జరిగింది.ఇక ఈ వేడుకలో టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రెటీలు పాల్గొని బాగా సందడి చేశారు.
ఇక ఈ పార్టీ జరిగి 15 రోజులు అయినప్పటికీ కూడా ఆ పార్టీలో జరిగిన సందడిని ఇప్పటికీ వదులుకోవట్లేదు ఆ నటీనటులు.దీంతో తాజాగా ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధా తన ట్విట్టర్ వేదికగా తను చేసిన డ్యాన్స్ వీడియోను పంచుకుంది.
ఇక ఆ వీడియో షేర్ చేస్తూ.తనకు ఎంతో ఇష్టమైన పాటకు ఇలా స్టెప్పులు వేసినందుకు చాలా సంతోషంగా ఉంది అని తెలిపింది.

అంతేకాకుండా తన కొలీగ్స్ అందరూ దీనికి ఎంతగానో సపోర్ట్ చేశారు అంటూ.80స్ పార్టీ సమయంలోను, ఆ తర్వాత ప్రతి మూమెంట్ ను ఎంతగానో ఎంజాయ్ చేశాను అని తెలిపింది రాధ.అయితే ఆమె షేర్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అయింది.ఆ వీడియోలో ఆమె చేసే డాన్స్ స్టెప్పులకు అక్కడున్న నటీనటులంతా బాగా ఎంజాయ్ చేశారు.
ఒకప్పుడు ఎంత ఎనర్జీగా డాన్స్ చేసిందో ఇప్పుడు కూడా అంతే ఎనర్జీగా ఆమె డాన్స్ చేయడంతో.వెంకటేష్ వచ్చి ఆమె మెడలో పూలదండ వేశాడు.
ఇంకా చిరంజీవి వచ్చి ఏకంగా ముద్దు, టైట్ హగ్గు ఇచ్చాడు.ఇక ఈ వీడియోలో చిరంజీవి చేసిన పనిని చూసి అందరూ తప్పు పడుతున్నారు.
ముసలోళ్లకు దసరా పండుగ అంటూ ఈ పార్టీ పై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.

ఇక ఈ వయసులో కూడా చిరంజీవి సినిమాలలో చిన్న హీరోయిన్లతో రొమాన్స్ చేయడమే చాలా చిరాకు తెప్పించే సన్నివేశాలు అని.ఇప్పుడు బయట కూడా పెళ్లయి పిల్లలు ఉన్న హీరోయిన్లతో అలా ముద్దులు పెట్టడం ఏంటి అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.ఆయన అంతా వయసు వచ్చినప్పటికీ కూడా అలా చేయడం కరెక్ట్ కాదు కదా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.







