ఈ సమాజంలో రాజకీయ నాయకుల హవానే ఎక్కువ నడుస్తుంది.సొంత ఆలోచనలతో కాకుండా వ్యతిరేక పార్టీలతో పోటీగా ప్రవర్తిస్తున్నారు రాజకీయ నాయకులు.
ముఖ్యంగా తమ గురించి తాము డప్పు కొట్టుకోవడానికి సిద్ధమయ్యారు.ఇప్పటికే పలు రాజకీయ నాయకుల సపోర్టుతో పలు టీవీ ఛానల్స్ ఉన్నాయి.
దీంతో ఆ ఛానల్స్ వాళ్ళు తమ రాజకీయ నాయకుల పార్టీల గురించి సపోర్టుగా మాట్లాడుతూ ఇతర పార్టీల గురించి విమర్శలు చేస్తూ ఉంటారు.ఒకవేళ ఆ ఛానల్స్ తమ రాజకీయ నాయకులు చేసిన తప్పును కూడా ఒప్పుగా సమర్థిస్తూ ఉంటారు.
అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చర్చ చేయాల్సి వచ్చింది అంటే తాజాగా అల్లు వారి ఆహా ఓటీటీ వేదిక కూడా అలాగే తయారైంది.సినిమాలకు సంబంధించిన విషయాలను కాకుండా రాజకీయాన్ని కూడా తవ్వుతుంది ఈ ఫ్లాట్ ఫామ్.
మామూలుగా రాజకీయ నాయకులకు, సిని ప్రముఖులకు దగ్గర సంబంధం ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే.అయితే ప్రస్తుతం ఆహా ఫ్లాట్ ఫామ్ లో నందమూరి బాలయ్య అన్ స్టాపబుల్ 2 టాక్ షో రియాల్టీ షో చేస్తున్నాడు.
సీజన్ 1 గతంలో మంచి ఆదరణ పొందింది.మొదటి సీజన్ లో సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులను తీసుకొచ్చి బాగా రచ్చ రచ్చ చేశాడు బాలయ్య.అయితే ఈ సీజన్లో మాత్రం సినీ ప్రముఖుల కంటే ఎక్కువగా పొలిటికల్ లీడర్లను తీసుకొచ్చి బాగా రచ్చ చేస్తున్నాడు బాలయ్య.దీంతో ఓ వర్గం ప్రేక్షకులు ఈ షోను చూడటానికి ఇష్టపడటం లేదు.
పైగా నందమూరి ఫ్యామిలీ మొత్తం చంద్రబాబు పార్టీ అయినా తెలుగుదేశం కే సపోర్టు.దీంతో గతంలో బాలయ్య నారా చంద్రబాబు నాయుడుని తీసుకొచ్చి మరింత రచ్చ చేశాడు.
అంటే తమ రాజకీయ ప్రయోజనాలకు బాలయ్య ఈ షోను బాగా వాడుతున్నట్లు తెలుస్తుంది.అయితే ఇటీవల విడుదలైన మరో ఎపిసోడ్ ప్రోమో లో కూడా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నాడు.
ఇందులో కూడా రాజకీయం టాపిక్ బాగానే నడిచింది.ఇక బాలయ్య కిరణ్ కుమార్ రెడ్డి ని ఏపీకి సంబంధించి మూడు రాజధానుల గురించి ప్రశ్నించాడు.దాంతో కిరణ్ కుమార్ రెడ్డి ముందర ఉన్న పరిస్థితులు వేరు ఇప్పుడున్న పరిస్థితులు వేరు అంటూ సమాధానం ఇచ్చాడు.బాలయ్య ఇటువంటి రాజకీయాల టాపిక్ తీయటంతో.
టీడీపీ ప్రత్యర్థులతో పాటు ఇతర పార్టీల నాయకులు కూడా ఈ షోలో పాల్గొనాలంటే భయపడుతున్నట్లు తెలుస్తుంది.పైగా బాలయ్య తమ పార్టీ గురించి జనాల్లో సపోర్టు తెచ్చే విధంగా ప్రయత్నించటంతో ఇతర వర్గాల వాళ్ళు ఈ షోపై ముఖ్యంగా బాలయ్య పై విమర్శలు చేస్తున్నారు.
అయితే ఈ విషయాన్ని గమనించిన నిర్వాహకులు ఎక్కడ తమ వేదికకు ఎల్లో ముద్ర పడుతుందో అని భయపడుతున్నారు.దీంతో తాజాగా ప్రోమోలో మాత్రం బాలయ్య వైయస్ రాజశేఖర్ రెడ్డి గురించి పాజిటివ్ గా మాట్లాడటంతో ఇదంతా తమపై విమర్శలు రావద్దన్న ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారు అని కొందరు అంటున్నారు.అయితే కొందరు మాత్రం ఈసారి ఈ సీజన్ ను సినీ ప్రముఖుల కోసం కాదు అంటూ తమ రాజకీయాల కోసమే అని ముఖ్యంగా టీడీపీ పార్టీ కోసమే అని అంటున్నారు.