విజయనగరం జెడ్పీ సమావేశంలో అధికారులకు మంత్రి బొత్స సత్యనారాయణ క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది.శాఖా పరంగా అన్ని విషయాలపై అవగాహన పెంచుకోవాలని మందలించారు.
సబ్జెక్టుపై సరైన అవగాహన లేకపోతే నేర్చుకోండంటూ అధికారులకు సూచించారు.అంతేకానీ ప్రజా ప్రతినిధులను తప్పుదోవ పట్టించవద్దని హెచ్చరికలు జారీ చేశారు.
మామిడి తోటలకు ఇన్సూరెన్స్ ఉందని ఉద్యానవన శాఖ అధికారి చెప్పడంపై మంత్రి బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు.