కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అటవీ శాఖ అధికారులకు ఎట్టకేలకు పెద్దపులి జాడను కనిపెట్టారు.బెజ్జూర్ మండలంలోని మర్తిడి, చొప్పదండి, మొండికుంట పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు గుర్తించారు.
రాత్రి బెజ్జూర్ మండలం కుకుడ గ్రామంలో ఎద్దుపై దాడి చేసి చంపేసింది.పులి సంచారంతో సమీప గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
ఈ నేపథ్యంలో గ్రామస్థులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.ఒంటరిగా ఎవరూ బయటకు వెళ్లొద్దని, గుంపులు గుంపులుగా ఉండాలని సూచించారు.
అదేవిధంగా పెద్దపులిని పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.







