Andrea: పెళ్లి చేసుకున్న యువతులు సంతోషంగా లేరు.. ఆండ్రియా షాకింగ్ కామెంట్స్!

ప్రముఖ కోలీవుడ్ నటీమణులలో ఒకరైన ఆండ్రియా సింగర్ గా కూడా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.గతంలో పలు వివాదాల ద్వారా వార్తల్లో నిలిచిన ఆండ్రియాకు ప్రేక్షకుల్లో కూడా మంచి గుర్తింపు ఉంది.

 Andrea Shocking Comments Goes Viral In Social Media Details, Andrea, Heroine And-TeluguStop.com

బోల్డ్ రోల్స్ లో నటించడానికి కూడా ఆండ్రియా సిద్ధంగా ఉంటారనే సంగతి తెలిసిందే.పెళ్లికి దూరంగా ఉన్న ఈ ప్రముఖ నటి తాజాగా పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేయగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

కొన్ని వారాల క్రితం ఆండ్రియా ఒక భేటీలో మాట్లాడుతూ ఒకరిని నమ్మి డేటింగ్ చేసి మోసపోయానని చెప్పుకొచ్చారు.అలా మోసపోయిన సమయంలో శారీరకంగా మానసికంగా తాను తీవ్ర వేదనకు గురయ్యానని ఆండ్రియా కామెంట్లు చేశారు.

ప్రస్తుతం నటనపై దృష్టి పెట్టిన ఆండ్రియా లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ లలో నటిస్తూ ఆ ప్రాజెక్ట్ ల ద్వారా క్రేజ్ ను మరింత పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.

త్వరలో ఆండ్రియా నటించిన పిశాచి2 సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా ఆండ్రియా నటించిన మరో సినిమా అనల్ మేలే పని తులి ఈ శుక్రవారం నుంచి ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

Telugu Andrea, Kollywood, Pishachi-Movie

ప్రేమ, పెళ్లి గురించి ఆండ్రియా మాట్లాడుతూ 20 సంవత్సరాల వయస్సులోనే ఒక వ్యక్తిని ఇష్టపడ్డానని అన్నారు.ఆ వ్యక్తితో లవ్ వర్కౌట్ కాలేదని ఆమె కామెంట్లు చేశారు.

లవ్ వర్కౌట్ కాకపోవడంతో పెళ్లి కూడా ఆగిపోయిందని ఆండ్రియా అన్నారు.పెళ్లి చేసుకున్న యువతులలో చాలామంది సంతోషంగా లేరని పెళ్లి చేసుకోని యువతులు ఎక్కువగా సంతోషంగా ఉన్నారని ఆమె చెప్పుకొచ్చారు.

లైఫ్ ఆనందంగా గడపాలని నేను అనుకుంటున్నానని ప్రస్తుతానికి మ్యారేజ్ చేసుకోవాలని నేను భావించడం లేదని ఆండ్రియా పేర్కొన్నారు.ఆండ్రియా వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube