Revanth Reddy KCR : కేసీఆర్ పై పోరు .. సరికొత్త వ్యూహాలతో సిద్ధమైన రేవంత్ ? 

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సరికొత్త వ్యూహాలతో సిద్ధం అవుతున్నారు.తమ ప్రధాన రాజకీయ శత్రువైన టీఆర్ఎస్ అధినేత , తెలంగాణ సీఎం కేసీఆర్ తో తలపడేందుకు అవసరమైన రాజకీయ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు.

 Fight On Kcr Revanth Prepared With New Strategies , Revanth Reddy, Telangana Co-TeluguStop.com

ఎట్టి పరిస్థితుల్లోనూ టీఆర్ఎస్, బీజేపీలపై పోరాడే విషయంలో వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.ఈ విషయంలో కాంగ్రెస్ సీనియర్ల నుంచి ఇబ్బందులు ఎదురైనా,  వెనక్కి తగ్గకూడదని, కాంగ్రెస్ అధిష్టానం తమకు అందిస్తున్న సహకారాన్ని ఉపయోగించుకుని ముందుకు వెళ్లాలి అని రేవంత్ నిర్ణయించుకున్నారు.

దీనిలో భాగంగానే తెలంగాణ లో ప్రజలు ఎదుర్కుంటున్న ప్రధాన సమస్యలు అన్నిటి పైనా దృష్టి సారించారు.ఈ విషయంలో ఏ విధంగా ముందు కు వెళ్ళాలి అనే విషయం పై పార్టీ శ్రేణులతో రేవంత్ సమాలోచన చేస్తున్నారు.

సిట్టింగ్ స్థానమైన మునుగోడు లో పరాజయం ఎదురైనా లెక్కచేయకుండా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే విషయం పైనే రేవంత్ దృష్టి సారించారు.తాజాగా గాంధీ భవన్ లో పార్టీ నేతలతో నిర్వహించిన జూమ్ మీటింగ్ లో అనేక అంశాలపై చర్చించారు.

తెలంగాణ లో ప్రజలు ఎదుర్కుంటున్న ప్రధాన సమస్యల్లో ధరణి పోర్టల్ అంశం ఒకటి.ధరణి పోర్టల్ పై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది.దీంతో పాటు, ధాన్యం కొనుగోలు అంశంపైనా, పొడు భూముల సమస్యలపైన, పెద్ద ఎత్తున పోరాటాలు చేపట్టాలి అని నిర్ణయించుకున్నారు.
 

Telugu Aicc, Pcc, Revanth Reddy, Trs-Political

దీనికి తగిన కార్యాచరణను సైతం రూపొందించారు.అలాగే వివిధ ప్రజా సమస్యలపై ఇందిరా పార్క్ వద్ద రెండు రోజుల పాటు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టి ఆ తరువాత గవర్నర్ కు వినతిపత్రం ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు.

అలాగే రైతు రుణ మాఫీ, తదితర అంశాలపైనా పోరాటం చేసే విధంగా రేవంత్ ప్లాన్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube