ఇళయదలపతి హీరోగా నటిస్తున్న వారసుడు సినిమా వివాదం రోజు రోజుకీ ముదురుతోంది.దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు.
తెలుగులో వారసుడు, తమిళంలో వారిసుగా రానున్న ఈ మూవీని సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.అయితే డబ్బింగ్ సినిమాలు విడుదల చేయొద్దని తెలుగు సినీ నిర్మాతల మండలి లేఖ విడుదల చేసింది.
తెలుగు సినీ నిర్మాతల మండలి లేఖపై తమిళ సినీ దర్శకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.తెలుగు సినిమాలు తమిళనాడులో ఎలాంటి ఆటంకాలు లేకుండా విడుదల అవుతున్నాయి.
కానీ తమిళ సినిమాలను ఎందుకు అడ్డుకుంటున్నారని తమిళ దర్శకులు ప్రశ్నిస్తున్నారు.తాము కూడా తెలుగు చిత్రాలను అడ్డుకుంటామని పేర్కొన్నారు.
దర్శక నిర్మాతలు ఇద్దరూ తెలుగు వారేనని, హీరో మాత్రమే తమిళ నటుడని డైరెక్టర్ సీమాన్ తెలిపారు.ఇంత జరుగుతున్న స్పందించకుండా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఏం చేస్తోందని మండిపడ్డారు.







