NTR Yash : ఇదెక్కడి విడ్డూరం... ఎన్టీఆర్‌, యశ్‌ లపై సొంత అభిమానులు మండిపాటు

తెలుగు స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు కన్నడ స్టార్ హీరో రాకింగ్ స్టార్ యష్ లపై వారి వారి సొంత అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఎందుకంటే వారు తదుపరి సినిమా ల విషయం లో చేస్తున్న ఆలస్యమే అంటూ మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతుంది.

 Ntr And Yash Fans Unhappy With There Next Movies , Ntr, Yash , Fans Unhappy, To-TeluguStop.com

వీరిద్దరు కూడా చివరి సినిమా విడుదలై నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు తదుపరి సినిమా గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వం లో సినిమా ను చేసేందుకు ఓకే చెప్పినప్పటికీ ఆ సినిమా కు సంబంధించిన కథ ఇప్పటి వరకు సెట్ అవ్వలేదని.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వరకు జరుగుతుందని, అది ఎంత వరకు వర్కౌట్ అవుతుందో తెలియదు అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఎన్టీఆర్ ఆలస్యం చేయడం వల్లే కొరటాల శివ సినిమా ని మొదలు పెట్టడం లేదంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కేజీఎఫ్ మరియు కేజీఎఫ్ 2 లతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను దక్కించుకున్న యశ్‌ త్వరలోనే ఒక పాన్ ఇండియా సినిమా ను చేయబోతున్నట్లుగా ప్రచారం జరిగింది.కానీ ఇప్పటి వరకు అసలు ఆ సినిమా కు సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు.

దర్శకుడు ఎవరు.నిర్మాత ఎవరు.

కథ ఏంటి.ఏ భాష లో రాబోతుంది అనే విషయాల్లో ఎలాంటి క్లారిటీ లేక పోవడం తో ఆయన అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

కన్నడంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న ఈ హీరో వెంటనే సినిమా చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం ఉండేది.

Telugu Kgf, Tollywood, Yash-Movie

కానీ ఇప్పటి వరకు కూడా సినిమా మొదలు పెట్టక పోవడంతో ఇది ఎక్కడి విడ్డూరం అంటూ ఆయన అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఇంకా ఎన్నాళ్లు ఈ వెయింటింగ్‌ అంటూ వారి వారి అభిమానులు హీరోలను ప్రశ్నిస్తున్నారు.నిజంగానే ఈ ఇద్దరు హీరోలు కాస్త ఎక్కువ గ్యాప్ ని తీసుకుంటున్నారు.

ఇండస్ట్రీ హిట్ పడ్డ తర్వాత ఇంతటి గ్యాప్ తీసుకోవడం ఏ మాత్రం కరెక్ట్ కాదు అనేది అందరి అభిప్రాయం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube