నందమూరి బాలకృష్ణ తాజాగా విశ్వక్సేన్ హీరో గా నటించిన దాస్ కా దమ్కీ యొక్క ట్రైలర్ రిలీజ్ కార్యక్రమానికి హాజరైన విషయం తెలిసిందే.ఆ కార్యక్రమం లో బాలకృష్ణ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
ఆ సమయం లోనే తాను ఒక సినిమా కు దర్శకత్వం వహించాలని అనుకున్నాను.దాన్ని మొదలు పెట్టాను కానీ మధ్యలోనే వదిలి పెట్టాను అంటూ నర్తనశాల సినిమా గురించి గుర్తు చేసుకున్నారు.
అయితే మరో సారి దర్శకత్వం పై ఆసక్తి చూపిస్తున్నట్లుగా బాలకృష్ణ గతంలోనే పేర్కొన్నాడు. ఆదిత్య 369 సినిమా కు సీక్వెల్ గా ఒక సినిమా ను తీసుకు రాబోతున్నట్లుగా గతంలోనే ప్రకటించిన బాలకృష్ణ ఆ విషయం మర్చి పోయాడో ఏమో అనుకున్నారు అంతా.
కానీ తాజాగా దమ్కీ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో బాలకృష్ణ ఆ విషయాన్ని మళ్ళీ గుర్తు చేశాడు.
కచ్చితంగా వచ్చే సంవత్సరం ఆదిత్య 999 సినిమా ఉంటుందని అది నా దర్శకత్వంలోనే ఉంటుందని బాలయ్య క్లారిటీ ఇచ్చాడు.
గతం లో ఆ సినిమా లో మోక్షజ్ఞ నటించబోతున్నాడు అంటూ బాలకృష్ణ పేర్కొన్నాడు.కానీ ఈసారి ఆ విషయాన్ని ప్రస్తావించకుండా కేవలం తన దర్శకత్వం లో ఆదిత్య 999 ఉంటుందని అధికారికం గా ప్రకటించాడు.

వచ్చే సంవత్సరం అన్నాడు కనుక మరి ఆలస్యం లేకుండా ప్రస్తుతం చేస్తున్న సినిమా లు పూర్తి చేసి ఆ వెంటనే సీక్వెల్ ను మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు మీడియా సర్కిల్స్ వారు మాట్లాడుకుంటున్నారు.నందమూరి అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం లో వచ్చిన ఆదిత్య 369 సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో అందరికి తెల్సిందే.అందుకే ఆదిత్య 999 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.







