విశ్వక్సేన్ హీరో గా నటించిన ఒక సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా టీవీ9 స్టూడియో కి వెళ్లిన విషయం తెలిసిందే.ఆ సమయంలో దేవి నాగవల్లి కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
ఇద్దరి మధ్య మాటలు పెరిగి ఏకంగా గెటవుట్ ఆఫ్ మై స్టూడియో అంటూ దేవి నాగవల్లి హీరో విశ్వక్సేన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డ విషయం తెలిసిందే.ఆ సమయం లో విశ్వక్సేన్ కూడా కాస్త ఓవర్ గా రియాక్ట్ అయ్యాడు.
ఇద్దరి మధ్య వాగ్వాదం తరా స్థాయికి చేరింది.ఆ తర్వాత కూడా ఈ మాటల యుద్ధం కొనసాగింది.
చివరకు విశ్వక్సేన్ సారీ చెప్పడం తో మొత్తం పరిస్థితి కూల్ అయింది.ఆ సమయం లో దేవి నాగవల్లి కి క్షమాపణ అయితే చెప్పాడు కానీ అతడు మనసు లో ఆ కోపం ఇంకా అలాగే కంటిన్యూ అవుతున్నట్లుగానే ఉంది.
అందుకే తాను దర్శకత్వం వహించి నిర్మించిన దమ్ కి సినిమా లో గెటవుట్ డైలాగు ను విశ్వక్ సేన్ పెట్టాడు.
కారు లో హీరో హీరోయిన్ వెళుతున్న సమయం లో రొమాంటిక్ గా సాగుతున్న సన్నివేశంలో హీరోయిన్ సడన్ గా గెట్ అవుట్ ఆఫ్ మై కార్.
గేట్ అవుట్ ఆఫ్ మై కార్ అంటూ చెప్పిన డైలాగ్ కచ్చితంగా దేవి నాగవల్లిని ఉద్దేశించి ఆమె కు కౌంటర్ ఉన్నట్లుగానే చెప్పించాడు అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు.

మర్చి పోతున్న వివాదాన్ని మళ్లీ కెలకడం కాకుంటే ఏంటీ ఇది అంటూ జనాలు కొందరు ఈ విషయమై మాట్లాడుకుంటున్నారు.విశ్వక్సేన్ హీరో గా ఇటీవల ఓరి దేవుడా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.అతి త్వరలోనే దమ్కీ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా నిన్న రాత్రి ఈ సినిమా యొక్క ట్రైలర్ విడుదలైంది.ఆ ట్రైలర్ లో ఈ షార్ట్ ఉండడంతో దేవి నాగవల్లి మళ్ళీ వార్తలో నిలిచింది.
వీరిద్దరి మధ్య అప్పుడు ఏం జరిగింది అంటే కొందరు వీడియోలు ప్లే చేసి మరి చూస్తున్నారట.







