ప్రైవేట్ హాస్పిటల్స్ పై వైద్యశాఖ జరిమానాలు

సూర్యాపేట జిల్లా:ప్రైవేట్ ఆసుపత్రులు చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డా.కోట చలం హెచ్చరించారు.

జిల్లాలో అక్టోబర్ మాసంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ప్రైవేట్ హాస్పిటల్లో తనిఖీలు చేసి,చట్ట నిబంధనలను అతిక్రమించిన ఆసుపత్రులను గుర్తించి మూసివేసి,షోకాజ్ నోటిసులు జారీ చేసిన ప్రైవేట్ ఆసుపత్రులు సమాధానం ఇచ్చిన ఆరు ఆసుపత్రులకు శుక్రవార జరిమానా విధించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట పట్టణంలోని నిబంధనలను అతిక్రమించిన మైత్రి హాస్పిటల్,శ్రీ గణపతి హాస్పిటల్,ఎం‌ఎస్ రాజు డెంటల్ హాస్పిటల్,శ్రీ భవాని ఈ‌ఎన్‌టి హాస్పిటల్,శ్రీ రామచంద్ర పాలి క్లినిక్ కోదాడ, వేంకటేశ్వర నర్సింగ్ హోం నేరేడుచెర్ల వారికి హెచ్చరిస్తూ తదుపరి చట్ట నియమ నిబంధనలు పాటిస్తూ జరిమానా విదించినట్లు తెలిపారు.

ఈ తనిఖీ ప్రక్రియ నిరంతరం జరుగుతుందని,జిల్లాలోని అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు, స్కాన్నింగ్ సెంటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఎవరైనా అనుమతి లేకుండా ఆసుపత్రుల, స్కానింగ్ సెంటర్లు,ల్యాబులు నిర్వహించినట్లైతే చట్ట రీత్యా చర్యలు చేపట్టనునట్లు హెచ్చరించినారు.

స్థాయికి మించి గ్రామంలో వైద్యం చేస్తున్న ఆర్‌ఎం‌పి మరియు పి‌ఎం‌పి క్లినిక్ల్ లను సీజ్ చేసినట్లు చెప్పారు.ఇకముందు అందరూ నిబంధనలను పాటించి సహకరించాలని కోరారు.

Advertisement
భువనగిరి ఖిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం : ఎమ్మెల్యే మందుల సామేల్

Latest Suryapet News