యాదాద్రి భువనగిరి జిల్లా:నవంబర్ 19వ తేదీ శనివారం వరల్డ్ టాయిలెట్ డే సందర్భంగా అన్ని గ్రామాలలో స్వచ్ఛతా రన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు.స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ)లో భాగంగా నిర్వహించే”స్వచ్ఛతా రన్” యొక్క లక్ష్యం మరుగుదొడ్డి వినియోగం,సురక్షితమైన పారిశుద్యం, దృశ్య పరిశుభ్రత గురించి ప్రజలకు అవగాహన కల్పించడమని తెలిపారు.
అదే విధంగా అన్ని పాఠశాలలు, అంగన్వాడీ స్కూల్స్,గ్రామ పంచాయతీ ఆవరణలలో “స్వచ్ఛ ప్రతిజ్ఞ”చేయాని తెలిపారు.అన్ని గ్రామ పంచాయతీలలో వ్యక్తి గత మరుగుదొడ్ల నిర్మాణం మరియు 100% వినియోగంలోకి వచ్చే విధంగా ప్రజలందరికీ అవగాహన కల్పించుటకు బ్యానర్లు,పోస్టర్ల ద్వారా తెలియపరచాలని,గ్రామ పంచాయతీల ద్వారా వరల్డ్ టాయిలెట్ డే సందర్భంగా మెడికల్ కిట్స్,టీ-షర్ట్స్, సర్టిఫికెట్లు,మెమొంటోస్ అందజేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమాల నిర్వహణకు అయ్యే ఖర్చును గ్రామ పంచాయతీ నిధుల నుండి ఖర్చు చేసుకొనవలసిందిగా ప్రాజెక్ట్ డైరెక్టర్,కమిషనర్ సూచించడం జరిగిందని తెలిపారు.స్వచ్ఛతా రన్ కార్యక్రమాలలో పాఠశాల విద్యార్థులు,ఉపాధ్యాయులు,ఎస్.
హెచ్.జీ మహిళలు, అందరూ పాల్గొనవలసిందిగా కోరారు.







