టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ సూపర్ స్టార్ హీరో ఘట్టమనేని కృష్ణ ఈ లోకాన్ని వదిలి వెళ్లిన సంగతి తెలిసిందే.దీంతో ఈయన మరణాన్ని ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఆయన అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.
ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరో కృష్ణ ఇక లేరు అన్న విషయాన్ని ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
అనారోగ్య సమస్యతో బాధపడిన కృష్ణ రెండు రోజుల కిందట మరణించారు.
ఇక ఈయన అంత్యక్రియలు నిన్న జరగగా ఈయన చివరి చూపుల కోసం ఎంతోమంది అభిమానులు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు తరలి వచ్చారు.ఇక ఆయన కుటుంబం మాత్రం కృష్ణ మరణానికి ముందే రెండు ఘటనలతో కోలుకోక బాధపడగా అంతలోనే కృష్ణ మరణించడంతో కన్నీటి సంద్రంలో మునిగిపోయారు.
ఈ ఏడాదిలోనే మహేష్ తన అన్నని, తన తల్లిని కోల్పోయాడు.కొన్ని నెలల గ్యాప్ తోనే ఈ రెండు మరణాలు రావడంతో ఆ కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగింది.
అప్పటి నుంచి కృష్ణ కూడా చుట్టూ అందరూ ఉన్న ఒంటరిగా ఉన్నట్లే ఫీల్ అయినట్లు కనిపించాడు.దీంతో ఆయన కూడా ఈ లోకాన్ని వదిలి వెళ్లేసరికి మహేష్ బాబు కుటుంబం అసలు తట్టుకోలేక పోతుంది.

ముఖ్యంగా కృష్ణ మనవళ్ళు, మనవరాలు మాత్రం బాధను అసలు తట్టుకోలేకపోతున్నారు.తమ తాతతో గడిపిన క్షణాలను తలచుకుంటూ బాగా ఎమోషనల్ అవుతున్నారు.సోషల్ మీడియా వేదికగా కూడా ఎమోషనల్ పోస్ట్ షేర్ చేస్తూ మరింత కంటతడి పెట్టిస్తున్నారు.సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే మహేష్ బాబు కూతురు సితార తన తాతని ఎంత మిస్ అవుతున్నానో అని చెప్పుకుంటూ ఎమోషనల్ నోట్ షేర్ చేసుకుంది.
ఇక తాజాగా గౌతమ్ కూడా తన తాతను మిస్ అవుతున్నట్లు ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు.మామూలుగా గౌతమ్ సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ గా కనిపించడు.
అయితే తన తాత మరణించడంతో ఆ విషయాన్ని తట్టుకోలేక వెంటనే తన సోషల్ మీడియా వేదికగా తన బాధను బయటికి పెట్టాడు.తన తాతతో దిగిన ఫోటోను షేర్ చేస్తూ ఎమోషనల్ గా ఒక నోట్ పంపించాడు.

అందులో.‘మీరు ఎక్కడ ఉన్నప్పటికీ నేను మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను.నన్ను కూడా మీరు ప్రేమిస్తూనే ఉంటారని నాకు తెలుసు.నేను మిమ్మల్ని ఎంత మిస్ అవుతున్నానో మాటల్లో చెప్పలేను.ఐ మిస్ యూ తాతగారు’ అని గౌతమ్ ఎమోషనల్ పోస్ట్ చేయగా ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ అవుతుంది.ఇక ఆ పోస్ట్ చూసిన మహేష్ బాబు, కృష్ణ అభిమానులు, నెటిజన్స్ గౌతమ్ కు ధైర్యం ఇస్తున్నారు.
ఇక మరి కొంతమంది కూడా గౌతమ్ తో పాటు బాగా ఎమోషనల్ అయ్యారు.







