ఇష్టంగానో, అయిష్టంగాను ఏపీలో జనసేన బీజేపీలు పొత్తు కొనసాగిస్తున్నాయి.బిజెపితో పొత్తు తెగ తెంపులు చేసుకుని టిడిపి తో పొత్తు పెట్టుకునేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారనే వార్తలు వస్తున్న సమయంలోనే టిడిపి అధినేత చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను పరామర్శించడం, ఆ తరువాత ఈ పొత్తు వ్యవహారం పై మరింత రచ్చ జరగడం వంటివి తెలిసిన సంగతే.
ఇక కొద్దిరోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోది విశాఖపట్నం వచ్చిన సందర్భంగా పవన్ కళ్యాణ్ కు పిలుపు అందింది.ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోది తో పవన్ భేటీ అయ్యారు.
ఇక ఆ తరువాత బిజెపి జనసేన పొత్తుకు ఎటువంటి ఇబ్బందు లేదనే సంకేతాలు వచ్చాయి.
అలాగే టిడిపిని వీలైనంత దూరం పెట్టే ప్రయత్నాలు జనసేన బీజేపీలు చేస్తున్నాయనే విషయం అందరికీ క్లారిటీ వచ్చింది.
అయితే తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందని గతంలో పవన్ ప్రకటించారు.అయితే అక్కడ బిజెపితో పొత్తు పెట్టుకుంటుందా లేదా అనే విషయంలో ఎవరికీ క్లారిటీ లేదు.కాకపోతే తెలంగాణలో బిజెపి జనసేన టిడిపిలో పొత్తు పెట్టుకుని ఉమ్మడిగా టిఆర్ఎస్ , కాంగ్రెస్ లను ఎదుర్కొంటాయని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, ఈ పొత్తుల వ్యవహారంపై తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు.2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో తాము ఏ పార్టీతోను పొత్తు పెట్టుకోవడం లేదని , ఒంటరిగానే పోటీ చేస్తామని సంజయ్ క్లారిటీ ఇచ్చారు.ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఒంటరిగా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, జనసేన బిజెపిల పొత్తు ఏపీ వరకే పరిమితం అవుతుందని సంజయ్ క్లారిటీ ఇచ్చారు.

ప్రస్తుతం తెలంగాణలో టిడిపిని మరింత బలోపేతం చేసే ప్లాన్ లో చంద్రబాబు నిమగ్నమయ్యారు.ఈ క్రమంలోనే జనసేన బిజెపిలను కలుపుకుని ఎన్నికలకు వెళ్తారని విస్తృతంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బండి సంజయ్ పొత్తుల పై క్లారిటీ ఇవ్వడంతో తెలంగాణలో జనసేన టిడిపిలు ఏ విధంగా ముందుకు వెళ్తాయనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.







