Raj tharun aha naa pellanta: అయ్యో రాజ్ తరుణ్‌.. రవితేజ స్థాయి అనుకుంటే ఇలా అయ్యిందేంటి!

యంగ్ హీరో రాజ్ తరుణ్ ఉయ్యాల జంపాల సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన విషయం తెలిసిందే.ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత సినిమా చూపిస్తా మామ అనే సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

 Raj Tarun Aha Naa Pellanta Web Series Zee 5 Streaming Details, Aha Naa Pellanta,-TeluguStop.com

సినిమా చూపిస్తా మామ సినిమా తర్వాత రాజ్ తరుణ్ కి జూనియర్ మాస్ మహా రాజా అనే పేరు వచ్చింది.ఆ సినిమా తో ఏకంగా రవితేజ స్థాయిలో రాజ్ తరుణ్ దూసుకు పోవడం ఖాయం అంటూ చాలా మంది భావించారు.

కానీ సినిమా చూపిస్తా మామ తర్వాత ఒకటి రెండు సినిమా లు పర్వాలేదు అన్నట్లుగా వచ్చాయి.

ఆ తర్వాత సినిమాలు ఏవీ కూడా సక్సెస్ అవ్వలేదు.

ఇప్పటి వరకు మరే సినిమాతో సక్సెస్ దక్కించుకోలేక పోయాడు.భారీ విజయాలను సొంతం చేసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న రాజ్ తరుణ్ వరుస సినిమాలను చేయాలని భావించాడు.

కానీ ఆఫర్స్ దక్కక పోవడంతో తాజాగా ఒక వెబ్ సిరీస్ కి ఓకే చెప్పాడు, ఆ వెబ్ సిరీస్ కూడా షూటింగ్ పూర్తయి స్ట్రీమింగ్ రెడీ అయింది.ఆహ నా పెళ్ళంట అంటూ రూపొందిన ఈ వెబ్ సిరీస్ జీ5 ఓటిటి ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది.

సినిమాల్లో మాస్ మహారాజా గా దూసుకు పోతాడని భావించిన రాజ్ తరుణ్ ఇలా వెబ్ సిరీస్ లు చేసుకోవాల్సి వస్తుందని ఊహించలేదు అంటూ ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Telugu Mass Maharaj, Raj Tarun, Rajtharun, Raviteja, Shivani, Zee App-Movie

ఇటీవల వచ్చిన ఆహా నా పెళ్ళంట వెబ్ సిరీస్ యొక్క టీజర్ అందరు దృష్టిని ఆకర్షిస్తుంది.పెళ్లి పీటల మీద పెళ్లి కూతురు లేచి పోతే ఆ పెళ్ళి కొడుకు ఏం చేశాడు అసలు పెళ్లి కూతురు ఎందుకు లేచి పోయింది అనే నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ సాగుతుందట.ఈ వెబ్ సిరీస్ లో రాజ్ తరుణ్ కి జోడిగా సీనియర్ హీరో రాజశేఖర్ యొక్క పెద్ద కుమార్తె శివాని రాజశేఖర్ హీరోయిన్ గా నటించింది.

దాంతో అంచనాలు భారీగా ఉన్నాయి.ఈ వెబ్ సిరీస్ వీరిద్దరికీ వెండి తెర పై మళ్ళీ అవకాశాలు దక్కుతాయా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube