తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో ఏర్పాటైన సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది.ఇందులో భాగంగా ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్న తుషార్ కు నోటీసులు జారీ చేసింది.
ఈనెల 21న విచారణకు హాజరుకావాలని తుషార్ కు నోటీసులు పంపింది.ఎమ్మెల్యేల కొనుగోలు విషయం గురించి ఫామ్ హౌజ్ లో ఎమ్మెల్యే ఫైలట్ రోహిత్ రెడ్డితో తుషార్ ఫోన్ లో మాట్లాడినట్లు అధికారులు ఇప్పటికే గుర్తించారు.
ఈ క్రమంలో రామచంద్ర భారతి, ఫైలట్ రోహిత్ రెడ్డితో సంభాషణలపై వివరణ ఇవ్వాలని సిట్ నోటీసుల్లో పేర్కొంది.అయితే తుషార్ ప్రస్తుతం కేరళ ఎన్టీఏ కన్వీనర్ గా ఉన్నారు.
మరోవైపు కేరళలో సిట్ అధికారులు రెండు బృందాలుగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.నల్గొండ ఎస్పీ రెమా రాజేశ్వరి సారథ్యంలో కొచ్చితో పాటు కొల్లంలో సోదాలు కొనసాగుతున్నాయి.