అమరావతి రైతుల పాదయాత్రపై దాఖలైన పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.దీనిలో భాగంగా నిబంధనలు సవరించాలన్న పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది.గతంలో ఇచ్చిన ఆదేశాలనే పాటించాలని కోర్టు స్పష్టం చేసింది.600 మంది మాత్రమే పాదయాత్రలో పాల్గొనాలని తెలిపింది.పాదయాత్ర నిర్వహించే రైతులు కేవలం పోలీసులు ఇచ్చిన గుర్తింపు కార్డులనే కాకుండా.అధికారిక గుర్తింపు కార్డులు లేదా పత్రాలు ఏమైనా చూపించొచ్చని హైకోర్టు గత విచారణలో వెల్లడించింది.







