సూపర్ స్టార్ కృష్ణ మరణించడంతో చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తుంది.కేవలం ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా ఎంతో మంది సినీ సెలబ్రిటీలు అలాగే కృష్ణ గారి వద్ద పనిచేస్తున్నటువంటి ఎంతో మంది ఆర్టిస్టులు కూడా ఆయన మంచితనాన్ని గుర్తుచేసుకొని ఎంతో ఎమోషనల్ అవుతున్నారు.
ఇలా ఇప్పటికే ఎంతో మంది సెలెబ్రెటీలు అభిమానులు కృష్ణ గారి పార్థివదేహానికి నివాళులు అర్పించిన సంగతి తెలిసిందే.అయితే కృష్ణ దగ్గర పనిచేసేటటువంటి ఆయన మేకప్ మెన్ సైతం కృష్ణ మరణం పట్ల స్పందించి ఎంతో ఎమోషనల్ అయ్యారు.
కృష్ణ పర్సనల్ మేకప్ మధుసూదన్ రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ కృష్ణ గారి గురించి ఎన్నో విషయాలు వెల్లడించారు.
కృష్ణ గారికి తాను గత కొన్ని సంవత్సరాలుగా మేకప్ మెన్ గా పనిచేస్తున్నానని ఆయన తన చివరి సినిమా వరకు తానే మేకప్ వేశానని మధుసూదన్ రావు పేర్కొన్నారు.
కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు వంటి సినిమాలలో మేకప్ వేయడం కోసం ఎంతో సమయం పట్టింది అయినప్పటికీ కృష్ణ గారు ఎంతో ఓపికగా ఉండేవారని మధుసూదన్ రావు పేర్కొన్నారు.
ఆయన అలా కూర్చిలో కూర్చుని ఇక మీ ఇష్టం అంటూ మేకప్ విషయం అంతా తమకే వదిలేసేవారని ఈయన గుర్తు చేసుకున్నారు.కృష్ణ గారు ఎంతో గొప్ప నటుడు అయినప్పటికీ ఆయన ప్రతి ఒక్క ఆర్టిస్టును ఎంతో దేవుడిలా చూస్తారని ఆయన ఒక పుస్తకం లాంటివారు ఆయన జీవితం నుంచి మనం ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చు అంటూ ఈ సందర్భంగా మధుసూదన్ రావు పేర్కొన్నారు.కృష్ణ మరణించడంతో దేవుడు లాంటి వ్యక్తిని కోల్పోయామని ఈ సందర్భంగా ఈయన ఎంతో ఎమోషనల్ అయ్యారు.