మన భారతదేశంలో ఎన్నో అద్భుతమైన ప్రదేశాలున్నాయి.స్వర్గాన్ని తలపించే అందమైన ప్రకృతి సౌందర్యాలకు భారతదేశ నెలవని నిస్సందేహంగా చెప్పొచ్చు.
ఇలాంటి గొప్ప ప్రదేశాలు గురించి తెలుసుకుంటే ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే.కాగా తాజాగా నార్వేజియన్ దౌత్యవేత్త, మాజీ రాజకీయవేత్త, ఎరిక్ సోల్హీమ్ మన ఇండియాలో ఒక అందమైన జలపాతం వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో పేరు చేసిన ఆ వీడియో చూసి ఇండియాలో ఎంత అద్భుతమైన జలపాతం ఉందా? అసలు ఈ జలపాతంలో పారేది నీళ్లు కాదు పాలు అనే భ్రమ కలుగుతోంది.ఇదొక నేచర్ వండర్ అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.
నార్వే వాతావరణ, పర్యావరణ మాజీ మంత్రి ఎరిక్ తరచుగా భారతదేశంలోని అత్యంత అందమైన పర్యాటక ప్రదేశాలను పంచుకుంటారు.ఈసారి గోవాలోని జలపాతం వీడియో షేర్ చేశారు.ఈ జలపాతాన్ని ఆకాశం నుంచి షూట్ చేశారు.ఎవరైనా రైలులో గోవాకు వెళుతున్నట్లయితే ఈ జలపాతం అందాలను చాలా దగ్గరగా చూసి బాగా ఎంజాయ్ చేయవచ్చు.ఎరిక్ తన ట్వీట్‌లో, “ఇన్‌క్రెడిబుల్ ఇండియా! భగవాన్ మహావీర్ వన్యప్రాణుల అభయారణ్యం లోపల గోవా-కర్ణాటక సరిహద్దులో, మండోవి నది దూద్‌సాగర్ జలపాతంగా ఒక కొండపై నుంచి దూసుకుపోతుంది, దూద్‌సాగర్ అంటే ‘పాల సముద్రం’ అని అర్థం.” అని పేర్కొన్నారు.

ఆయన షేర్ చేసిన వీడియోలో ఒక బ్రిడ్జి పైనుంచి గూడ్స్ రైలు వెళుతుండగా దాని పక్కనే జలపాతం పారుతూ ఉంది.చూసేందుకు నీటికి బదులుగా ఆ జలపాతంలో పాలే పారుతున్నట్లు భ్రమ కలిగింది.వీడియోలో చూస్తేనే ఈ దృశ్యం ఎంతో అద్భుతంగా అనిపించింది.అదే నిజంగా కళ్ళతో చూస్తే ఇంకా ఎంత బాగుంటుందో అనే ఫీల్ కూడా వస్తుంది.ఈ వీడియో పై మీరు కూడా ఓ లుక్కేయండి.







